Share News

Hyderabad: కామెంట్‌ తెచ్చిన చేటు.. మద్యం మత్తులో అసభ్యకర వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:46 AM

యువతిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ప్రాణం మీదకొచ్చింది. సోదరిపై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు, ఆయన స్నేహితులు దాడి చేయడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈనెల 22న జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad: కామెంట్‌ తెచ్చిన చేటు.. మద్యం మత్తులో అసభ్యకర వ్యాఖ్యలు

- ఆగ్రహంతో దాడి చేసిన యువతి సోదరుడు

- చపాతీ కర్రతో దాడి, యువకుడి మృతి

- ఆలస్యంగా వెలుగులోకి ఘటన

హైదరాబాద్: యువతిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ప్రాణం మీదకొచ్చింది. సోదరిపై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు, ఆయన స్నేహితులు దాడి చేయడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈనెల 22న జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు(Kukatpally ACP Srinivasa Rao) తెలిపిన వివరాల ప్రకారం.. గత శుక్రవారం ముగ్గురు యువకులతో కలిసి వెంకటరమణ మద్యం సేవించి కూకట్‌పల్లి దుర్గా టిఫిన్‌ సెంటర్‌(Kukatpally Durga Tiffin Center) ఎదుట సమోసాలు తినేందుకు వచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: PM Modi: తక్కువ కాలంలో.. ఎక్కువ వ్యతిరేకత


అదే సమయంలో టీ స్టాల్‌లో సోదరీమణులతో కలిసి పవన్‌, శ్రీధర్‌ టీ తాగుతుండగా.. వెంకటరమణ యువతిపై కామెంట్‌ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన పవన్‌ వెంకటరమణపై దాడిచేశాడు. అక్కడే ఉన్న శ్రీధర్‌ ఫోన్‌ చేసి స్నేహితులను రప్పించి మద్యంమత్తులో ఉన్నవారిపై పిడిగుద్దులతో దాడి చేశారు. ఆవేశంలో ఉన్న పవన్‌ చపాతీ కర్రతో వెంకటరమణ (22)ను కొట్టడంతో తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మూసాపేటలోని తన ఇంట్లో వెంకటరమణ వాంతులు చేసుకొని బాత్రూమ్‌లో పడిపోయాడు.

city1.jpg


వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన చెన్నబోయిన పవన్‌, శ్రీధర్‌, బానోత్‌ సురేష్‌, గుంటుక అజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. చనిపోయిన యువకుడికి, దాడి చేసిన వారికి ఎలాంటి పరిచయం లేదని పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 06:46 AM