Share News

Hyderabad: మాయమాటలతో బాలికను అపహరించి అత్యాచారం..

ABN , Publish Date - Aug 16 , 2024 | 11:16 AM

మాయమాటలతో బాలికను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ఎల్బీనగర్‌ పోలీసులు(LB Nagar Police) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌ పరిధిలో ఉండే ఓ ఆటో డ్రైవర్‌ కుమార్తె(13) ఈనెల 7వ తేదీన పోచారం వంకమామిడిలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.

Hyderabad: మాయమాటలతో బాలికను అపహరించి అత్యాచారం..

- యువకుడు అరెస్టు

హైదరాబాద్: మాయమాటలతో బాలికను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ఎల్బీనగర్‌ పోలీసులు(LB Nagar Police) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌ పరిధిలో ఉండే ఓ ఆటో డ్రైవర్‌ కుమార్తె(13) ఈనెల 7వ తేదీన పోచారం వంకమామిడిలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. నల్లగొండ(Nalgonda) జిల్లా తిప్పర్తి మండలం రాజాపేట గ్రామానికి చెందిన చిట్యాల చందు అలియాస్‌ పండు(19) అక్కడ బోనాల జాతరలో డీజే లైటింగ్‌ పనులు చేస్తున్నాడు. జాతరలో ఆమె అతడికి పరిచయమైంది. మాయమాటలు చెప్పి అతడు ఆమె వివరాలు తీసుకున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: మధిర, వికారాబాద్‌లలో కొత్త జైళ్ల నిర్మాణాలకు చర్యలు


పథకం ప్రకారం ఈనెల 13న అతడు ఆమెకు ఫోన్‌ చేసి, మాయమాటలు చెప్పి తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రోజు కుమార్తె కనిపించకపోవడంతో అంతటా వెతికి విఫలమై రాత్రి 11గంటలకు తండ్రి ఎల్బీనగర్‌ పోలీసులకు(LB Nagar Police) ఫిర్యాదు చేశాడు. 14వ తేదీన పండు బాలికను ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. అతడు తనపై అత్యాచారం చేశాడని తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఎల్బీనగర్‌ మెట్రో వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసి, విచారణ అనంతరం రిమాండుకు తరలించారు.


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

..............................................................

Hyderabad: మధిర, వికారాబాద్‌లలో కొత్త జైళ్ల నిర్మాణాలకు చర్యలు

- జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా

హైదరాబాద్: మధిర, వికారాబాద్‌(Madhira, Vikarabad)లలో కొత్త జైళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్యమిశ్రా(DG Dr. Soumyamishra) వెల్లడించారు. చంచల్‌గూడలోని జైళ్లశాఖ సీకా పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ... కొత్తగా సిద్దిపేటలో హై సెక్యూరిటీ జైలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ(Mahbubnagar, Nalgonda) కేంద్ర కారాగారాలలో నూతన బ్యారక్‌ల నిర్మా ణం, మధిర, వికారాబాద్‌లలో కొత్త జైళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే స్థల సేకరణ చేశామని వెల్లడించారు.


city4.jpg

శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబసభ్యులకు, విడుదలైన ఖైదీలకు జీవనోపాధి సహాయం కోసం రుణాలు, స్వయం ఉపాధి అందజేస్తున్నట్లు తెలిపారు. జైళ్ల పరిపాలనను ఆధునీకరించే కేంద్ర ప్రభుత్వం పథకం మోడల్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ 2023 పకడ్బందీగా అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వరంగల్‌, హైదరాబాద్‌(Warangal, Hyderabad)లో మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. చంచల్‌గూడ, సంగారెడ్డి జైళ్లలో స్టీల్‌ ఫర్నిచర్‌ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఐజీలు వై. రాజేష్‌, మురళీబాబు, డీఐజీలు డాక్టర్‌ శ్రీనివా స్‌, సంపత్‌, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2024 | 11:16 AM