Hyderabad: ప్రాణం తీసిన గుంత..
ABN , Publish Date - Sep 26 , 2024 | 09:59 AM
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు(Jawaharnagar Dumping Yard)కు వచ్చే ప్రధానమార్గంలో ఏర్పడిన భారీ గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గుంతలో నీళ్లు నిలిచి ఉండడంతోపాటు అందులో బండరాళ్లు వేయడంతో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి కిందపడిపోయారు.
- దెబ్బతిన్న డంపింగ్‌యార్డు ప్రధాన మార్గం
- గుంతలో పడి మాజీ ఉపసర్పంచ్ దుర్మరణం
- గ్రామస్తుల ఆందోళన, ఆఫీస్ అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు(Jawaharnagar Dumping Yard)కు వచ్చే ప్రధానమార్గంలో ఏర్పడిన భారీ గుంత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గుంతలో నీళ్లు నిలిచి ఉండడంతోపాటు అందులో బండరాళ్లు వేయడంతో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి కిందపడిపోయారు. అదేసమయంలో డీసీఎం వ్యాన్ వేగంగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుడు మాజీ ఉపసర్పంచ్ కావడంతో గ్రామస్థులు భారీగా చేరుకొని డంప్‌యార్డు వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ డంప్‌యార్డుకెళ్లే మార్గంలో తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కందాటి అమరేందర్‌రెడ్డి (50) బుధవారం తన బైక్‌పై వెళ్తున్నారు. చెన్నాపురం-తిమ్మాయిపల్లి వద్ద భారీ గుంతలో బండరాళ్లు తగిలి కిందపడిపోయారు. అదే సమయంలో డీసీఎం వ్యాన్ నీటిలో వేగంగా వెళ్తూ అమరేందర్‌రెడ్డిని ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ఇదికూడా చదవండి: TS News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
డంపింగ్‌యార్డ్ నిర్లక్ష్యం వల్లే..
మాజీ ఉపసర్పంచ్ మృతి విషయం తెలుసుకున్న తిమ్మాయిపల్లి గ్రామస్థులు ఘటనా స్థలానికి భారీగా చేరుకొని ఆందోళన నిర్వహించారు. అమరేందర్‌రెడ్డి మృతదేహాన్ని డంపుయార్డు కార్యాలయంలో ఉంచి రాంకీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. డంప్‌యార్డుకు వచ్చే భారీ వాహనాల వల్లే ప్రధానరోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయని, ఈ మార్గంలో నిత్యం నీరు ఏరులై పారుతున్నా సంస్థ పట్టించుకోలేదంటూ ఆఫీసు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో దిగొచ్చిన రాంకీ యాజమాన్యం పలుమార్లు చర్చలు జరిపి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు ఒప్పుకుందని స్థానికులు తెలిపారు.
.............................................................
ఈ వార్తను కూడా చదవండి:
.............................................................
Hyderabad: గాంధీలో పసికందు కిడ్నాప్..
- రెండు గంటల్లోనే కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) నుంచి రెండు రోజుల వయసు ఉన్న శిశువు అపహరణకు గురికావడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును కొద్ది గంటల్లోనే ఛేదించి, శిశువును సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నల్గొండ(Nalgonda) జిల్లా గుండాల మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన సుభాన్, షాహినా భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. బాబు కోసమని మళ్లీ గర్భం దాల్చిన షాహినాకు నొప్పులు రావడంతో ఈనెల 24న ఉదయం గాంధీ ఆసుపత్రిలోని మాతాశిశు సంక్షేమ కేంద్రం (ఎంసీహెచ్)లో అడ్మిట్ చేశారు.
అదే రోజు ఉదయం 10.30 గంటలకు బాబుకు జన్మనిచ్చింది. అయితే బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో షాహినాకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉండడంతో బాబును అక్కడే వదిలేసి వెళ్లింది. తిరిగొచ్చే సరికి తన శిశువు కనిపించ లేదు. దీంతో ఆసుపత్రి వర్గాల సహాయంతో అవుట్ పోస్ట్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఓ మహిళ బాబును అపహరించి, ఆస్పత్రి ఆవరణలోనే ఉండడాన్ని గుర్తించి, శిశువును కాపాడారు. ఫిర్యాదు అందిన 2 గంటల్లోనే శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..
ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..
Read Latest Telangana News and National News