Share News

Hyderabad: వీడిన ‘గోనెసంచిలో డెడ్‌బాడీ’ మిస్టరీ.. భార్యే హత్య చేసింది

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:34 AM

హత్య చేసి.. డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి రోడ్డు పక్కన వేసిన కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భార్యే హత్య చేసినట్లు తేలింది. తాగివచ్చి వేధిస్తున్నాడని సోదరి సాయంతో ఉరేసి చంపేసింది.

Hyderabad: వీడిన ‘గోనెసంచిలో డెడ్‌బాడీ’ మిస్టరీ.. భార్యే హత్య చేసింది

- అక్క సాయంతో ప్రణాళిక అమలు

హైదరాబాద్: హత్య చేసి.. డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి రోడ్డు పక్కన వేసిన కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భార్యే హత్య చేసినట్లు తేలింది. తాగివచ్చి వేధిస్తున్నాడని సోదరి సాయంతో ఉరేసి చంపేసింది. మృతదేహాన్ని సంచిలో పెట్టి రోడ్డు పక్కన పడేసింది. కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా


బిహార్‌కు చెందిన మహ్మద్‌ ముంతాజ్‌ ఆలామ్‌(40), రోషన్‌ ఖాతూన్‌(35) భార్యాభర్తలు. బతుకు దెరువుకోసం వీరు నలుగురు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి మైలార్‌దేవుపల్లి(Mylardevupalli) ఉడంగడ్డలో ఉంటున్నారు. ముంతాజ్‌ఖాన్‌(Mumtaz Khan) స్థానిక చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తూ రోజూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. అది తట్టుకోలేక ఎలాగైనా భర్తను హత్య చేయాలని అక్క రవీనాబీబీతో కలిసి పథకం వేసింది.


ఈనెల 20న రాత్రి మద్యం తాగి వచ్చిన ముంతాజ్‌ఖాన్‌ మత్తుతో ఇంట్లో పడుకున్నాడు. పథకం ప్రకారం రోషన్‌ఖాతూన్‌ ఆమె అక్క రవీనాబీబీ కలిసి ముంతాజ్‌ఖాన్‌ గొంతుకు వస్త్రం, నవారు తాడును బిగించి హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోనెసంచిలో మూటకట్టి ప్యాసింజర్‌ ఆటోలో పెట్టుకుని ఆరాంఘర్‌ వెళ్లే మార్గంలో నీరు లేని డ్రైనేజీ కాలువలో పడేశారు.


దర్యాప్తు చేపట్టిన మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌(Inspector Narendra) సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు మహిళలు ప్యాసింజర్‌ ఆటోలో వచ్చి గోనెసంచీని డ్రైనేజీ కాలువ లో పడవేసినట్లు తేలింది. లోతుగా దర్యాప్తు చేసి మృతుడిని దుర్గానగర్‌ కు చెందిన మహ్మద్‌ ముంతాజ్‌ఖాన్‌గా గుర్తించారు. విచారణలో భార్య రోషన్‌ ఖాతూన్‌, ఆమె అక్క కలిసి ఈ హత్య చేసినట్లు కనుగొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 06:34 AM