Share News

Hyderabad: అద్దెకుంటున్న ఇంట్లో చోరీ.. పోలీసులకు చిక్కిన మహిళ

ABN , Publish Date - Aug 04 , 2024 | 11:04 AM

తనకున్న అప్పుు తీర్చుకొని సంతోషంగా జీవించాలని అనుకున్న ఓ మహిళ ఆమె అద్దెకుంటున్న ఓనర్‌ ఇంటికే కన్నం వేసింది. బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌(Bachupally Police Station) పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉండే బడుగు జ్యోతి(27) తాను అద్దెకు ఉంటున్న యజమాని భార్యతో సన్నిహితంగా ఉండేది.

Hyderabad: అద్దెకుంటున్న ఇంట్లో చోరీ.. పోలీసులకు చిక్కిన మహిళ

- 20 తులాల నగలు స్వాధీనం

హైదరాబాద్: తనకున్న అప్పుు తీర్చుకొని సంతోషంగా జీవించాలని అనుకున్న ఓ మహిళ ఆమె అద్దెకుంటున్న ఓనర్‌ ఇంటికే కన్నం వేసింది. బాచుపల్లి పోలీస్‏స్టేషన్‌(Bachupally Police Station) పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉండే బడుగు జ్యోతి(27) తాను అద్దెకు ఉంటున్న యజమాని భార్యతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆ ఇంటి తాళం చెవులను డూప్లికేట్‌ చేయించి తన వద్ద దాచుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు మరిది వరుసయ్యే ఇంద్రమ్మకాలనీలో ఉండే జంపని చైతన్యకుమార్‌(22)తో కలిసి బంగారు నగలు, నగదు చోరీ చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: లింక్‌ ఓపెన్‌ చేస్తే ఖాతా ఖాళీ కావడం ఖాయం..


అయితే ఇంటి యజమానులు వచ్చి చూసేసరికి ఇంటి తాళం వేసింది వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన నగలు, రూ.90 వేల నగదు మాయంకావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఉపేందర్‌రావు(CI Upender Rao) ఆదేశాల మేరకు డీఐ తిమప్ప ప్రత్యేక టీంతో బంగారు దుకాణాల వద్ద నిఘా పెట్టించారు. ఈ క్రమంలో శనివారం ప్రగతినగర్‌(Pragatinagar)లో బ్యాగు చేతిలో పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి.


ఇదికూడా చదవండి: Hyderabad: కబ్జాదారుల బరితెగింపు.. హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నం

city5.3.jpg

పోలీసులు వారి నుంచి రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితురాలు రెండేళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటూ వారి కదలికలను గమనిస్తూ చోరీకి పాల్పడిందని పోలీసులు తెలిపారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 04 , 2024 | 11:10 AM