Hyderabad: విషాధం.. నవ్వుతూ చికిత్సకు వెళ్లిన మహిళ మృతి
ABN , Publish Date - Nov 22 , 2024 | 08:46 AM
ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గుండె జబ్బుతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందంటూ బంధువులు ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు.
- ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
హైదరాబాద్: ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి(LB Nagar Kamineni Hospital)లో దారుణం చోటుచేసుకుంది. గుండె జబ్బుతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందంటూ బంధువులు ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మురళీనగర్‌కు చెందిన రత్లావత్ కొటే(54) అనే మహిళ కు రెండు నెలల నుంచి గుండె దగ్గర నొప్పి వస్తుందంటూ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడి వైద్యులు ఆపరేషన్ చేయాలంటూ చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నగరంలో.. కాశ్మీర్ అందాలు
అనంతరం వారు తమకు సమీపంలో ఉండటంతో పాటు చికిత్స కూడా బాగుంటుందన్న నమ్మకంతో కామినేని ఆస్పత్రికి బుధవారం ఉదయం 7గంటల సమయంలో వచ్చి అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ రాత్రి 10గంటలకు మృతిచెందింది. ఇందుకు ఆగ్రహించిన మృతురాలి భర్త చందు, కుమారులు శ్రీకాంత్, శ్రీను(Srikanth, Srinu), ఇతర బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికిత్స సజావుగానే జరుగుతుందని చెప్పుకొచ్చిన వైద్యులు వెంటనే చికిత్స అందించాల్సి ఉండగా రోగికి సంబంధించిన రూ.10లక్షల బీమా క్లయిమ్ అయ్యే వరకు వేచి ఉండి తీరా అవి దావా అయ్యాక చనిపోయిందని చెప్పారన్నారు. చికిత్స సజావుగా జరిగి ఆరోగ్యంగా తిరిగి వస్తానని నవ్వుతూ వెళ్లిన కొటే వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా మృతిచెందిందని ఆమె కుటుంబ సభ్యులు బంధువులతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 9గంటలకు మృతి చెందిందని తమకు చెప్పిన వైద్యులు రిపోర్టులో 10గంటలకు అంటూ నమోదు చేయడంపై వారు మరింతగా అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులను సముదాయించగా ఆందోళన సద్దుమణిగింది.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News