Hyderabad: ఒడిశా నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో గంజాయి రవాణా..
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:36 AM
బ్యాగ్‌లలో గంజాయి నింపుకొని ఒడిశా నుంచి రైల్లో హైదరాబాద్(Hyderabad)కు వచ్చి పోలీసుల కళ్లుగప్పి సరుకును సరఫరా చేయాలని చూసిన ఘరానా స్మగ్లర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ) పోలీసులు పట్టుకున్నారు.
- స్మగ్లర్ అరెస్ట్.. 22 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ: బ్యాగ్‌లలో గంజాయి నింపుకొని ఒడిశా నుంచి రైల్లో హైదరాబాద్(Hyderabad)కు వచ్చి పోలీసుల కళ్లుగప్పి సరుకును సరఫరా చేయాలని చూసిన ఘరానా స్మగ్లర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ) పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 5.55 లక్షల విలువైన 22 కేజీల గంజాయి బ్యాగ్‌లను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మిక పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది స్మగ్లర్స్ మాదకద్రవ్యాలను గుట్టుగా నగరానికి తెస్తున్నారు. ఇదే క్రమంలో ఒడిశా గజపతి జిల్లాకు చెందిన కురేష్ పైక్ అలియాస్ కురేష్కు నగరంలోని గంజాయి స్మగ్లర్‌తో పరిచయం ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ దాడి..
అతడి ఆదేశాల మేరకు కురేష్ 22 కేజీల గంజాయిని బ్యాగ్‌లలో నింపుకొని రైల్లో సికింద్రాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి రిసీవర్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడికి సరుకు అందజేసి, డబ్బు తీసుకొని వెంటనే వెళ్లిపోవడానికి వేచి చూస్తున్నాడు. ఇంతలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న హెచ్ న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డానియేల్ బృందాలు రంగంలోకి దిగాయి. మార్కెట్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడి చేసి కురేష్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News