Share News

Hyderabad: మద్యంమత్తులో విషం తాగి ఇద్దరు మృతి

ABN , Publish Date - Nov 29 , 2024 | 07:34 AM

మద్యంమత్తులో ఇద్దరు కూలీలు విషం తాగి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌(Malakpet Inspector Naresh) తెలిపిన వివరాల ప్రకారం.. ముసారాంబాగ్‌ సంజీవయ్యనగర్‌ బస్తీకి చెందిన నరేందర్‌ (45) కూలీ.

Hyderabad: మద్యంమత్తులో విషం తాగి ఇద్దరు మృతి

హైదరాబాద్: మద్యంమత్తులో ఇద్దరు కూలీలు విషం తాగి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌(Malakpet Inspector Naresh) తెలిపిన వివరాల ప్రకారం.. ముసారాంబాగ్‌ సంజీవయ్యనగర్‌ బస్తీకి చెందిన నరేందర్‌ (45) కూలీ. అంబర్‌పేట దుర్గానగర్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన వెంకటేష్‌ (35) జీహెచ్‌ఎంసీ స్వచ్ఛట్రాలీ ఆటోలో చెత్త సేకరిస్తుంటాడు. వీరిద్దరూ స్నేహితులు. నిత్యం మద్యం సేవించి మలక్‌పేట సలీంనగర్‌(Malakpet Salimnagar)లోని పార్క్‌ వద్ద ఉంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Cyber ​​criminals: ఫ్రీ క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ దోపిడీ


city3.2.jpg

బుధవారం రాత్రి పార్కు వద్ద అనుమానాస్పదస్థితిలో పడిపోయిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మృతిచెందడంతో వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష చేయించగా గుర్తుతెలియని విషం తాగి మృతిచెందినట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. నరేందర్‌ భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటుండగా, వెంకటేశ్‏కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 07:34 AM