Hyderabad: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాటలు.. రెండు పబ్‌ల నిర్వాహకులపై కేసు
ABN , Publish Date - May 24 , 2024 | 11:54 AM
కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పబ్‌లో సంగీతం, పాటలు(Music and songs) పెడుతున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు - 1లో నివసించే బానోత్‌కార్తిక్ నాయక్ ఫోనోగ్రాఫిక్ పర్‌ఫామెన్స్ లిమిటెడ్ కంపెనీ (పీపీఎల్)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైస్సెన్సింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నాడు.
హైదరాబాద్: కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పబ్‌లో సంగీతం, పాటలు(Music and songs) పెడుతున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు - 1లో నివసించే బానోత్‌కార్తిక్ నాయక్ ఫోనోగ్రాఫిక్ పర్‌ఫామెన్స్ లిమిటెడ్ కంపెనీ (పీపీఎల్)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైస్సెన్సింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నాడు. వివిధ బాషల్లో ఉన్న సినిమాల పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా సుమారు 45 లక్షల పాటలకు సంబంధించి కాపిరైట్స్ వ్యవహారం ఈ పీపీఎల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. పీపీఎల్ నుంచి లైస్సెన్స్ తీసుకొని వారి ఆదీనంలో ఉన్న పాటలను పబ్‌లు, ఇతర పార్టీల్లో వాడాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్‌లో ఉన్న బాబీలాన్ కిచెన్, రెస్టారెంట్, అమ్నీషియా పబ్ నిర్వాహకులు ఎలాంటి లైస్సెన్స్ పొందకుండా ఇష్టానుసారంగా పాటలు, సంగీతాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: భారీగా పెరిగిన పప్పుల ధరలు...
ఇది గమనించి పీపీఎల్ సిబ్బంది గతేడాది సెప్టెంబర్ 5న రెండు పబ్‌ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. స్పందన లేకపోవడంతో అదే నెల 15న లీగల్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 15, ఈ యేడాది జనవరి, ఫిబ్రవరిలో మరోసారి నోటీసులు జారీ చేశారు. కాని వారు పట్టించుకోలేదు. దీంతో కార్తిక్‌నాయక్ ఇది పీపీఎల్ కాపీరైట్స్ 36 చట్టాన్ని అతిక్రమించినట్టేనని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాబీలాన్ నిర్వాహకులు కుమార్‌లాల్, సుశీల్ అగస్టిన్, నీరజ్ మలానీ, మెరిన్‌బాబు, బిందియాజవార్‌తో పాటు అమ్నేషియా నిర్వాహకులు రాజశేఖర్ రామనాథ్ పురం, కునాల్‌కుక్రేజాపై సెక్షన్ 406,420 ఐపీసీ కాపీ యాక్ట్ 53,63,69 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News