Share News

Hyderabad: ప్రేమించిన వాడిని మరచిపోలేక.. నవవధువు ఆత్మహత్య

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:07 PM

ప్రేమించినవాడిని కాదని మరొకరితో బలవంతంగా వివాహం జరిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నవవధువు ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Petbashirabad Police Station) పరిధిలో జరిగింది.

Hyderabad: ప్రేమించిన వాడిని మరచిపోలేక.. నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించినవాడిని కాదని మరొకరితో బలవంతంగా వివాహం జరిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నవవధువు ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Petbashirabad Police Station) పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పేరవలి(Peravali) మండలం ముక్కమాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రామలక్ష్మీల కుమార్తె దుర్గాశ్రీదేవి(25).

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. విషయం ఏంటంటే..


హైదరాబాద్‌(Hyderabad)లో సీఏ చదువుతూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ సమీపంలో ఓ హాస్టల్‌లో ఉంటూ ఆ హాస్టల్‌ యజమానిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. దీనికి పెద్దలు అంగీకరించలేదు. గత అక్టోబరు 16న నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(Software Engineer)తో వివాహం జరిపించారు. వీరు ప్రస్తుతం పేట్‌బషీరాబద్‌ పరిధి ఎంఎన్‌రెడ్డినగర్‌లోని ఓ రెసిడెన్సీలో నివాసముంటున్నారు.


తాను ప్రేమించిన యువకుడిని మరిచిపోలేక దుర్గాశ్రీదేవి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీ(శుక్రవారం) సాయంత్రం 7.30గంటల సమయంలో తమ రెసిడెన్సీలోని ఐదంతస్తులపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి 9గంటలకు మృతి చెందింది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు శనివారం వివరాలు వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: Minister PonnamPrabhakar: సమగ్ర కుటుంబ సర్వేపై ఆందోళన వద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఈవార్తను కూడా చదవండి: KTR: విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్

ఈవార్తను కూడా చదవండి: Caste Census: తెలంగాణలో 243 కులాలు

ఈవార్తను కూడా చదవండి: Tummala: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 10 , 2024 | 12:07 PM