Share News

Hyderabad: బ్యాంక్‌లోకి వెళ్లి.. వేటకొడవళ్లు, కత్తులతో దాడి

ABN , Publish Date - Dec 21 , 2024 | 07:22 AM

పెళ్లి బరాత్‌లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న వ్యక్తి స్నేహితులతో కలిసి దాడి చేయడంతో కేసుకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్‏స్టేషన్‌(Chaitanyapuri Police Station) పరిధిలో శుక్రవారం జరిగింది.

Hyderabad: బ్యాంక్‌లోకి వెళ్లి.. వేటకొడవళ్లు, కత్తులతో దాడి

- పెళ్లిలో గొడవ.. పాతకక్షలు

- టార్గెట్‌ ఒకరు.. గాయపడింది ఇతరులు

హైదరాబాద్: పెళ్లి బరాత్‌లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న వ్యక్తి స్నేహితులతో కలిసి దాడి చేయడంతో కేసుకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్‏స్టేషన్‌(Chaitanyapuri Police Station) పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఎన్టీఆర్‌ నగర్‌ నివాసి పగిళ్ల పురుషోత్తం, తట్టిఅన్నారం నివాసి బొడ్డు మహేష్‌ స్నేహితులు. 2022లో జరిగిన పురుషోత్తం పెళ్లి బరాత్‌లో మహేష్‌ గొడవ పడ్డాడు. పురుషోత్తం బీరు బాటిల్‌తో దాడిచేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం..


దీనిపై పోలీస్‌ కేసు నమోదైంది. అప్పటి నుంచి మహేష్‌ పురుషోత్తంపై కక్ష పెంచుకున్నాడు. హయత్‌నగర్‌ కోర్టులో ఇరువురు రాజీ కుదుర్చుకోడానికి అంగీకరించారు. రాజీలో భాగంగా మహే్‌షకు రూ. 4 లక్షలు చెల్లించేందుకు పురుషోత్తం అంగీకరించాడు. శుక్రవారం హయత్‌నగర్‌(Hayatnagar) కోర్టుకు రావాల్సి ఉంది. బొడ్డు మహేష్‌ తాను సూర్యాపేటలో ఉన్నానని కోర్టు కానిస్టేబుల్‌కు చెప్పి హాజరుకాలేదు.


దీంతో పురుష్తోతం తన స్నేహితులైన సికింద్రాబాద్‌ నివాసి రాము, తట్టిఅన్నారం నివాసి నాగరాజు, బాలు, శ్రీను, ఆంజనేయులుతోపాటు ఇంకో ఇద్దరితో కలిసి కొత్తపేట మోహన్‌నగర్‌లోని అమరావతి వైన్స్‌లో మద్యం తాగుతున్నారు. అప్పటికే వీరిపై నిఘా పెట్టిన మహేష్‌ తన స్నేహితులు బాబు, నందనవనం నివాసి సురేందర్‌ అలియాస్‌ సూరి, బెల్లి భరత్‌, మరో ఇద్దరితో కలిసి వారిపై సినీ పక్కీలో వేట కొడవళ్లు, కత్తులతో దాడిచేశారు. పురుషోత్తం తప్పించుకుని పారిపోయాడు.


city2.2.jpg

గడ్డమోని రాజు(28), తట్టి అన్నారం నివాసి పాశం నాగరాజు(28) దాడి నుంచి తప్పించుకునేందుకు ఎదురుగా ఉన్న ఏయూ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి వెళ్లారు. వీరిని వెంబడించిన నిందితులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

దాడికి పాల్పడిన వారిలో సురేందర్‌ గతంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. గాయపడినవారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పురుషోత్తం చైతన్యపురి పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 07:22 AM