Hyderabad: వామ్మో.. రూ. 10 కోట్లు కొల్లగొట్టేశారుగా..
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:51 AM
మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.. ఏపీకి చెందిన శివయ్య(Shivayya) సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం భార్య, కొడుకు, ఓ అడ్వొకేట్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ఏర్పాటుచేశారు.
- యూట్యూబ్ చానళ్లలో ప్రచారం నిర్వహించిన కేటుగాడు
- శిక్షణ కోసం లక్ష ఫీజు వసూలు
- సహకరించిన భార్య, కొడుకు, అడ్వొకేట్
- నలుగురి అరెస్టు
హైదరాబాద్ సిటీ: మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.. ఏపీకి చెందిన శివయ్య(Shivayya) సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం భార్య, కొడుకు, ఓ అడ్వొకేట్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ఏర్పాటుచేశారు. ఓ ఛానల్ ద్వారా ప్రకృతి వైద్యుడిగా శివయ్య ప్రచారం చేసుకొన్నాడు. మరో ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో డబ్బు సంపాదించేందుకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ తీసుకునే వారి నుంచి రూ. లక్ష ఫీజు వసూలు చేశారు. మొత్తం రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టి మంగళవారం నలుగురిని అరెస్టు చేశారు. నగరంలో ఉంటున్న ఏపీకి చెందిన శివయ్య అలియాస్ శివకుమార్ భార్య స్వర్ణలత, కొడుకు జశ్వంత్, అడ్వ కేట్‌తో కలిసి సులభంగా డబ్బు సంపాదించేందుకు పథ కం వేశాడు. మీ మాంస, రీబూట్ పేరుతో రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ప్రారంభించారు.
ఇదికూడా చదవండి: Secunderabad: నేడు సికింద్రాబాద్-కొల్లం రైలు రద్దు
ప్రకృతి వైద్యంపై అవగాహన ఉండటంతో మీమాంస ఛానల్ ద్వారా శివయ్య బీపీ, మధుమేహం, థైరాయిడ్, కేన్సర్(BP, Diabetes, Thyroid, Cancer) వ్యాధులకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. నమ్మిన వారిని మభ్య పెట్టి రీబూట్ అనే మరో ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బు సంపాదనకంటూ శిక్షణ ఇచ్చేవాడు. ఇందుకు గాను లక్ష ఫీజు వసూలు చేసేవాడు. రియల్ రంగంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో లాభాలొ స్తాయని నమ్మించాడు. నిజమని నమ్మిన 70 మంది లక్షల్లో పెట్టుబడి పెట్టారు. వారి నుంచి శివయ్య రూ.10.86 కోట్లు కొల్లగొట్టాడు. ఎంతకూ లాభాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు నిలదీయగా తాను గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు బినామీ అని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించాడు. శివయ్య తీరుపై అనుమా నం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయిం చగా అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా.. భార్య స్వర్ణలత, కొడుకు జశ్వంత్, అడ్వొకేట్ శ్రీనివాస్‌తో కలిసి మోసం చేస్తున్నట్టు చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్, అతని కొడుకు జశ్వంత్ గతంలో జైలు కెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. మీమాంస, రీబూట్ పేరుతో జరిగే మోసాలను నమ్మొద్దని, ఆర్థిక మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ సూచించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News