Share News

Hyderabad: స్నేహితుని బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసి మాట్లాడుతుండగా...

ABN , Publish Date - Dec 25 , 2024 | 08:02 AM

స్నేహితుడి పుట్టినరోజని కేక్‌ కొని తెచ్చారు. రోడ్డుపై కట్‌ చేయించి సెలబ్రేట్‌ చేశారు. ఆ సంతోషాలను నెమరు వేసుకుంటూ మాట్లాడుతుండగా అతివేగంగా వచ్చిన ఓ బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్నేహితుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డాడు.

Hyderabad: స్నేహితుని బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసి మాట్లాడుతుండగా...

- బుల్లెట్‌ ఢీకొని యువకుడి మృతి

- మరొకరికి గాయాలు

హైదరాబాద్: స్నేహితుడి పుట్టినరోజని కేక్‌ కొని తెచ్చారు. రోడ్డుపై కట్‌ చేయించి సెలబ్రేట్‌ చేశారు. ఆ సంతోషాలను నెమరు వేసుకుంటూ మాట్లాడుతుండగా అతివేగంగా వచ్చిన ఓ బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్నేహితుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డాడు. మలక్‌పేట పోలీస్ స్టేషన్‌(Malakpet Police Station) పరిధిలో ఈ సంఘటన జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం


ఇన్‌స్పెక్టర్‌ పి.నరేష్‌(Inspector P. Naresh) తెలిపిన వివరాల ప్రకారం ముసారాంబాగ్‌ బస్తీ నివాసి ఉమేష్‌ పుట్టినరోజు మంగళవారం కావడంతో అతని స్నేహితులు నరేష్‌, మలక్‌పేట వెస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ నివాసి సందీప్ యాదవ్‌ (35), అతని సోదరుడు సాయికిరణ్‌ యాదవ్‌లు కలిసి సోమవారం అర్ధరాత్రి కేక్‌ తీసుకువచ్చారు. స్వామి వివేకానంద సెంటినరీ స్కూల్‌ ఎదుట ఉమే్‌షతో కేక్‌ కట్‌ చేయించారు.


city4.2.jpg

అనంతరం అక్కడే మాట్లాడుకుంటుండగా ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌ నివాసి షేక్‌ షాబాజ్‌ (19)బుల్లెట్‌ వాహనంపై వేగంగా వచ్చాడు. డివైడర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి అక్కడే ఉన్న సందీప్ యాదవ్‌(Sandeep Yadav)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ యాదవ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


ఇతని పక్కనే నిల్చున్న నరేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడు సందీప్ యాదవ్‌కు భార్య, ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రైవేటు పాల డెయిరీలో పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌ యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు కారకుడైన షేక్‌ షాబాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును మలక్‌పేట ఎస్‌ఐ సంజీవరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 08:02 AM