Share News

Hyderabad: ఆయుధాలను విక్రయించడానికి యత్నిస్తున్న యువకుడి అరెస్ట్‌

ABN , Publish Date - May 03 , 2024 | 12:32 PM

తుపాకులు విక్రయించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసుల(Cyberabad SOT Police) వలకు చిక్కాడు. ఇతని నుంచి కంట్రిమేడ్‌ పిస్టల్‌, మూడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఆయుధాలను విక్రయించడానికి యత్నిస్తున్న యువకుడి అరెస్ట్‌

- కంట్రీమేడ్‌ పిస్టల్‌, మూడు బుల్లెట్‌లు స్వాధీనం

హైదరాబాద్: తుపాకులు విక్రయించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసుల(Cyberabad SOT Police) వలకు చిక్కాడు. ఇతని నుంచి కంట్రిమేడ్‌ పిస్టల్‌, మూడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్‌ఓటీ, జీడిమెట్ల పోలీసులకు ఈ యువకుడు పట్టుబడటం విశేషం. మెదక్‌జిల్లా, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌కు చెందిన శేషగిరిగౌడ్‌ కుమారుడు గుడ్డి వంశీకృష్ణగౌడ్‌ (23) కుత్బుల్లాపూర్‌ అయోధ్యనగర్‌లో నివాసముంటూ స్థానికంగా ఎలివేటర్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల వ్యాపారి విశాల్‌ యాదవ్‌ పరిచయం అయ్యాడు.

city6.jpg

ఇదికూడా చదవండి: Online games: ‘కొంప’ ముంచిన ఆన్‏లైన్ గేమ్స్..

తాను ఆయుధాలు సరఫరా చేస్తుంటానని, మీకు ఆసక్తి ఉంటే పిస్టల్స్‌ సరఫరా చేస్తానని, హైద్రాబాద్‌(Hyderabad)లో ఆయుధాలు అమ్మి డబ్బు బాగా సంపాదించవచ్చునని ఆశచూపాడు. దీంతో వంశీ ఒక పిస్టల్‌ను 50వేలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా రూ. 19వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. మార్చి 6న వరంగల్‌ ఖాజీపేట్‌కు వచ్చిన విశాల్‌యాదవ్‌కు మిగిలిన రూ.30వేలు చెల్లించి 3 రౌండ్లతో కూడిన పిస్టల్‌ను తీసుకున్నాడు. గత రెండు నెలలుగా పిస్టల్‌ను రూ.2లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి యాక్టివా వాహనంపై బాలానగర్‌ వైపు వెళ్తున్న వంశీకృష్ణను చింతల్‌ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు అడ్డుకోవడంతో అతని వద్ద పిస్టల్‌ బయటపడింది. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 03 , 2024 | 12:32 PM