Investment Fraud: ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ పేరుతో యువతి రూ.3 కోట్లకుపైగా దోపిడీ..అరెస్ట్!
ABN , Publish Date - Jan 31 , 2024 | 07:43 PM
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో ఏకంగా యువతి ఈ మోసానికి పాల్పడటం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. పార్ట్ టైం జాబ్స్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఓ యువతి అనేక మందికి గాలం వేసింది. ఆ క్రమంలో మీరు కేవలం రివ్యూ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని పలువురికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పెట్టింది.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ
ఆ విధంగా యువతి అనేక మంది వద్ద బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు అందించి డబ్బులు సంపాదించింది. ఈ దందా నేపథ్యంలో ఇంకొంత మందిని పెట్టుబడి పెట్టే విధంగా చేసి వారి నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలకుపైగా లూటీ చేసింది. ఆ క్రమంలోనే నగరంలోని పద్మారావునగర్‌కు చెందిన ఓ వ్యక్తి యువతి మాటలు నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దీంతో అతను సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు శృతి మయూర్ బఫ్నా అనే యువతిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో మొత్తంగా ఇలాంటివి 25 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో మూడు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరైనా తెలియని వ్యక్తులు చెబితే నమ్మోద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. దీంతోపాటు వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను కూడా క్లిక్ చేయోద్దని, ఎవరికీ కూడా మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వొద్దని అధికారులు కోరారు.