Home » Cyberabad Police
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్(Cyberabad Police Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కమిషనర్ అవినాష్ మహంతి(Commissioner Avinash Mohanty) ఆదేశాలు జారీ చేశారు.
Lookout notice: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితులకు పోలీసులు లకౌట్ నోటీసులు జారీ చేశారు.
Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక మంది సైబర్ మోసానికి బలయ్యారు. తాజాగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా మోసపోయింది.
Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
Telangana: 2024 సంవత్సరంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 32 శాతం పెరిగిందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సైబర్ క్రైమ్లో 11914 కేసులకు గాను రూ.70 కోట్ల అమౌంట్ రికవరీ అయ్యిందన్నారు. డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందన్నారు. 8 వేల మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు.
అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలతో రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.
సైబర్ మోసాల్లో దోచుకున్న సొత్తును నేరగాళ్లు వెంటనే విత్ డ్రా చేస్తున్నారు. హవాలా మార్గంలో ప్రధాన నేరగాళ్లకు చేరవేస్తున్నారు. ఆపై సైబర్ చైన్ లింక్లను కట్ చేసి సాంకేతిక ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. నగదుకు సంబంధించిన లావాదేవీలన్నీ దాదాపుగా డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
బిగ్బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ పరిష్మన్ల కోసం ఆన్లైన్ ద్వారా అనుమతి ఇచ్చే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. అనుమతులు పొందే పద్ధతిని సులభతరం చేసినట్లు ఆయన చెప్పారు.