Share News

Big Fraud: 200 మందిని బురిడీ కొట్టించిన 19 ఏళ్ల కుర్రాడు.. వీడిది మామూలు స్కెచ్ కాదు

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:55 PM

Big Fraud: ఎంతో మంది మోసగాళ్ల గురించి విని ఉంటారు. కానీ వీడు వాళ్లందరి కంటే కాస్త డిఫరెంట్. వయసు చిన్నదే అయినా ఇతడి బుర్ర మామూలుది కాదు. అందుకే ఏకంగా 200 మందిని బురిడీ కొట్టించాడు.

Big Fraud: 200 మందిని బురిడీ కొట్టించిన 19 ఏళ్ల కుర్రాడు.. వీడిది మామూలు స్కెచ్ కాదు

మోసగాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఎంతో మంది కేటుగాళ్ల గురించి విని ఉంటారు. కానీ వీడు వాళ్లందరి కంటే కాస్త డిఫరెంట్. వయసు చిన్నదే అయినా ఇతడి బుర్ర మామూలుది కాదు. అందుకే ఏకంగా 200 మందిని బురిడీ కొట్టించాడు. నేరుగా మోసాలు చేసేవారినైనా గుర్తుపట్టొచ్చు గానీ ఇలా జనాల బలహీనతలను వాడుకొని ఎదుగుదాం అనుకునేవారిని పట్టుకోవడం కష్టమే. వయసులో చిన్నోడే.. కానీ తెలివి మీరిన ఈ కుర్రాడు చాలా మందిని మోసం చేశాడు. డబ్బు విషయంలో ప్రజలకు ఉండే బలహీనతల్ని క్యాష్ చేసుకొని భారీ మొత్తాన్ని కొట్టేశాడు. అసలు ఎవరీ కేటుగాడు? అతడు చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


డబ్బే ధ్యేయంగా..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ 19 కుర్రాడు తన తెలివితేటలు, మాటకారితనంతో ఏకంగా 200 మందిని నమ్మించి మోసం చేశాడు. వారి దగ్గర నుంచి రూ.42 లక్షలు కాజేశాడు. ఢిల్లీకి చెందిన కాశిఫ్ మీర్జా అనే కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే చదువు మీద ఫోకస్ పెట్టాల్సి ఆ కుర్రాడు.. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టకున్నాడు. ఇందులో భాగంగానే ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ పెట్టి వందలాది మందిని మోసం చేశాడు.


నమ్మించి మోసం

సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు సంపాదించాడు కాశిఫ్ మీర్జా. ఇదే పేరును వాడి చాలా మందిని బుట్టలోకి దింపాడు. తాను ఓ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను నడిపిస్తున్నట్లు చెప్పి అందులో పెట్టుబడులు పెట్టించాడు. మాయమాటలతో వారిని నమ్మించాడు. రూ.99,999 పెట్టుబడి పెడితే 13 వారాల్లో రూ.1,39,999 వస్తాయని.. భారీ లాభమని నమ్మించాడు. అలా మొదట్లో ఇన్వెస్ట్ చేసిన కొందరికి మనీ రిటర్న్ ఇచ్చాడు. దీంతో మిగిలిన వాళ్లు ఇది నిజమేనని నమ్మి డబ్బులు కట్టి మోసపోయారు. అయితే అతడి ఆట కట్టించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశిఫ్ మీర్జా నుంచి హ్యుండాయ్ వెర్నా కార్, క్యాష్ కౌంటింగ్ మెషీన్, ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.


Also Read:

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

దొంగలతో జట్టుకట్టి ప్రాణాలు కోల్పోయిన మాజీ పోలీసు

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..

For More Crime And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 04:18 PM