Well: బావిలో గుప్పుమన్న విషవాయువు.. ఐదుగురు మృతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:35 PM
ఓ బావి(well)లోకి దిగిన ఐదుగురు విషవాయువు కారణంగా ఊపిరాడక మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఓ బావి(well)లోకి దిగిన ఐదుగురు విషవాయువు కారణంగా ఊపిరాడక మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బిర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కికిదార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. బావిలో పడిన కలపను బయటకు తీసేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడుతో బావిలోకి దిగిన వ్యక్తి మొదట ఊపిరాడక కేకలు వేయడంతో మరో వ్యక్తి అందులోకి దిగి అతను కూడా కాపాడాలని కోరాడు.
మరో ముగ్గురు వ్యక్తులు బావిలోకి వెళ్లగా మార్గమధ్యంలో పెద్ద ఎత్తున విషవాయువు బావిలోనుంచి లీకై అందులోనే పడిపోయారు. దీంతో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఆ విష వాయువు దాటికి తట్టుకోలేక మృత్యువాత చెందారు.
కలపను తీయడానికి మొదట రాజేంద్ర జైస్వాల్ బావి(well)లోకి వెళ్లాడు. అతని అరుపులు విని పక్కింటి రమేష్ పటేల్ పరుగున వచ్చాడు. ఆ క్రమంలో తాడు పట్టుకుని బావిలోకి దిగి విషవాయువు ప్రబలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వారి కేకలు విని కుమారులు రాజేంద్ర, జితేంద్ర ఇద్దరూ పరుగున వచ్చారు. తండ్రిని కాపాడేందుకు ఇద్దరూ బావిలోకి దిగగా వారు కూడా బావిలో పడిపోయారు. నలుగురూ బయటకు రాకపోవడంతో ఒడ్డున నిలబడిన టికేష్ చంద్ర దిగాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఐదుగురిలో ఎవరూ బయటకు రాలేదు. ఐదుగురి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను రామచంద్ర జైస్వాల్, రమేష్ పటేల్, జితేంద్ర పటేల్, రాజేంద్ర పటేల్, టికేశ్వర్ చంద్రగా గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే అసలు బావిలోని విషవాయువు ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి:
మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
BJP leader: బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటంటే...
Read Latest Crime News and Telugu News