Share News

Police Crime: పోలీసుల దాష్టికం.. 19 ఏళ్లుగా వేధింపులు.. చివరికి తీరని విషాదం

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:05 PM

సామాన్య ప్రజలకు న్యాయం, రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన ధర్మం. అఫ్‌కోర్స్.. చాలామంది తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు కానీ, కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులకు గురి చేస్తుంటారు. సామాన్యుల తప్పు లేకపోయినా సరే..

Police Crime: పోలీసుల దాష్టికం.. 19 ఏళ్లుగా వేధింపులు.. చివరికి తీరని విషాదం

సామాన్య ప్రజలకు న్యాయం, రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన ధర్మం. అఫ్‌కోర్స్.. చాలామంది తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు కానీ, కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులకు గురి చేస్తుంటారు. సామాన్యుల తప్పు లేకపోయినా సరే.. కావాలనే ఇబ్బందులు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల కొందరు అమాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు పెట్టే టార్చర్ కన్నా.. చావడమే నయమని భావించి ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఇలాంటి విషాదకరమైన ఘటన మరొకటి వెలుగు చూసింది. సాక్షాత్తూ కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినప్పటికీ.. ఓ కేసులో ఒక వ్యక్తిని 19 ఏళ్లుగా వేధిస్తుండటంతో, అది తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..


రాజేష్ కుమార్ అనే 47 ఏళ్ల వ్యక్తి జమ్ముకశ్మీర్‌లోని జానీపూర్ నివాసంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. 19 ఏళ్ల క్రితం అతనిపై ఒక తప్పుడు కేసు నమోదు అయ్యింది. తానేం తప్పు చేయలేదని మొత్తుకున్నా.. పోలీసులు ఆ వ్యక్తిని ఆ ఫేక్ కేసులో ఇరికించారు. అయితే.. న్యాయస్థానం అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది. దాంతో.. ఇక సంతోషంగా గడపొచ్చని రాజేష్ భావించాడు. కానీ.. కోర్టు నిర్దోషి అని తీర్పునిచ్చినా, పోలీసులు అతడ్ని విడిచిపెట్టలేదు. ఆ తప్పుడు కేసులో అతడ్ని నిత్యం వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఎప్పుడుపడితే అప్పులు పోలీస్ స్టేషన్‌కి పిలిపించడం, తాము చెప్పినట్లు వినకపోతే ఇతర కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకు పాల్పడేవాళ్లు. కుటుంబం కోసం రాజేష్ వారి వేధింపుల్ని భరిస్తూ వచ్చాడు. పోలీసులు ఏం చెప్పినా చేశాడు. కానీ.. 19 ఏళ్లు అయినప్పటికీ తనని విడిచిపెట్టకపోవడం, వారి టార్చర్ మరింత పెరిగిపోవడంతో.. ఆత్మహత్యే శరణ్యమని భావించి, రాజేష్ సూసైడ్ చేసుకున్నాడు.

బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని ఆ పని చేసింది.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!

అంతకుముందే తన ఆత్మహత్యకు పోలీసులే కారణమని, ఒక ఫేక్ కేసులో తనని పెట్టిన ఇబ్బందుల వల్లే చనిపోతున్నానని పేర్కొంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజేష్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానీపూర్ వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు హామీ ఇవ్వడంతో వాళ్లు శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ DSP జహీర్ అబ్బాస్ జాఫారి తెలిపారు. రాజేష్ మృతిపై తమకు అనుమానం ఉందని, విచారణ సమయంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 10:05 PM