Karnataka: వీడు మనిషి కాదు మానవమృగం.. డిన్నర్ వడ్డించలేదన్న పాపానికి భార్యను..
ABN , Publish Date - May 30 , 2024 | 08:12 PM
మనుషుల్లో రానురాను నేరస్వభావం బాగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలపై కూడా కోపాద్రిక్తులై దారుణాలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పుడు...
మనుషుల్లో రానురాను నేరస్వభావం బాగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలపై కూడా కోపాద్రిక్తులై దారుణాలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లనే అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా అలాంటి కిరాతకానికే తెగబడ్డాడు. కేవలం డిన్నర్ వడ్డించలేదన్న పాపానికి తన భార్యను హత్య చేశాడు. అంతటితో అతని కోపం చల్లారలేదు.. ఆమెను నరికి, తోలు ఒలిచేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన కర్ణాటకలో (Karnataka) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Read Also: రాహుల్ గాంధీనే నెక్ట్స్ ప్రధాని.. షారుఖ్ ట్వీట్ వెనుక అసలు కథ ఇది!
కర్ణాటక రాష్ట్రం కుణిగల్ తాలూకాలోని హులియూరుదుర్గ పట్టణంలో శివరామ, పుష్పలత (35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాడుకునేవారు. కట్ చేస్తే.. సోమవారం శివరామ తన పనులు పూర్తి చేసుకొని రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. తనకు భోజనం వడ్డించాలని భార్యని కోరాడు. కానీ.. పుష్పలత అందుకు నిరాకరించింది. ‘నువ్వే భోజనం పెట్టుకో’ అని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కోపాద్రిక్తుడైన శివరామ.. భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.
Read Also: నెక్ట్స్ టార్గెట్ అదే.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ బాంబ్
ఆపై కొడవలితో పుష్పలత తల నరికి శరీర భాగాలను ఛిద్రం చేశాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు మృతదేహంపై ఉన్న చర్మాన్ని ఒలిచేశాడు. అతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే.. లోపలున్న పేగులు సైతం బయటకు వచ్చేశాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో వారి ఎనిమిదేళ్ల కుమారుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తన భార్యని చంపాక శివరామ తన నేరాన్ని యజమానికి చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో పడి ఉన్న మృతదేహాన్ని చూసి.. అధికారులందరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
Read Also: లోన్ వోల్ఫ్ ఎటాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్కు ఉగ్రముప్పు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శివరామను అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసు సూపరింటెండెంట్ అశోక్ వెంకట్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలోనే పుష్పలత మృతదేహం లభ్యమైందని, శివరామని అరెస్ట్ చేశామని, అతనే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడని చెప్పారు. పదేళ్ల క్రితం పుష్ప, శివరాం కులాంతర వివాహం చేసుకున్నారని.. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని తమకు తెలిసిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.
Read Latest Crime News and Telugu News