Madhya Pradesh: ఫ్యామిలీ ఫంక్షన్‌లో షాకింగ్ ఘటన.. సంగీతం ఆపిన పాపానికి అన్నయ్యనే..
ABN , Publish Date - Mar 10 , 2024 | 05:54 PM
ఈ ఆధునిక యుగంలో రానురాను మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో కేవలం మ్యూజిక్ ఆపాడన్న కోపంతో.. సొంత అన్నయ్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు అని కూడా చూడకుండా.. తనని డ్యాన్స్ చేయనివ్వలేదన్న నెపంతో గొడ్డలితో నరికి చంపేశాడు.
ఈ ఆధునిక యుగంలో రానురాను మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో కేవలం మ్యూజిక్ ఆపాడన్న కోపంతో.. సొంత అన్నయ్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు అని కూడా చూడకుండా.. తనని డ్యాన్స్ చేయనివ్వలేదన్న నెపంతో గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సత్నా జిల్లాలోని (Satna District) మౌహర్ జిల్లాలో (Mauhar Village) రాజ్‌కుమార్ (Rajkumar) (30), రాకేష్ (Rakesh) (35) అనే సోదరులు నివసిస్తున్నారు. శుక్రవారం (08/03/24) సాయంత్రం రాకేశ్ తన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించాడు. కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. సౌండ్ సిస్టమ్ పెట్టుకొని.. డ్యాన్స్ కూడా చేశారు. అయితే.. సమయం ఎక్కువ అవ్వడంతో రాకేష్ మ్యూజిక్ ఆపేశాడు. ఈ విషయంలోనే సోదరుల మధ్య వాగ్వాదం మొదలైంది. రాజ్‌కుమార్ ఏమో తనకు ఇంకా డ్యాన్స్ చేయాలని ఉందని, మ్యూజిక్ పెట్టమని డిమాండ్ చేశాడు. అందుకు రాకేష్ అంగీకరించకపోవడంతో.. ఇద్దరి మధ్య గొడవ నెలకొంది.
ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన రాజ్‌కుమార్.. గొడ్డలి తీసుకొని రాకేష్‌పై దాడి చేశాడు. దీంతో.. అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి, ఓ కల్వర్టు వద్ద నిందితుడు దాక్కున్నాడని తెలుసుకొని, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. సొంత అన్నయ్యనే తమ్ముడు చంపడంతో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.