Mumbai: పట్టపగలే నడిరోడ్డుపై.. కనికరం లేకుండా యువతిని..
ABN , Publish Date - Jun 18 , 2024 | 07:26 PM
మహారాష్ట్రలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని ఒక యువకుడు కిరాతకంగా హతమార్చాడు. అది కూడా పట్టపగలే నడిరోడ్డుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న..
మహారాష్ట్రలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని ఒక యువకుడు కిరాతకంగా హతమార్చాడు. అది కూడా పట్టపగలే నడిరోడ్డుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న జనం ఇదంతా చూస్తూ ఉండిపోయారే తప్ప, అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ దుర్మార్గుడు ఎందుకిలా చంపేశాడో తెలుసా? తనకు బ్రేకప్ చెప్పి, మరొకరితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతోనే! పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత ప్రవర్తన.. స్టేజ్‌పై..
ముంబై నగరానికి సమీపంలోని వసాయ్ ప్రాంతానికి చెందిన రోహిత్ యాదవ్ (20), ఆర్తి యాదవ్ గతంలో ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏం చెడిందో తెలీదు కానీ.. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. కానీ.. రోహిత్ మాత్రం ఆమెని విడిచి ఉండలేకపోయాడు. ఆర్తితోనే కలిసి ఉండాలని అనుకునేవాడు. కానీ.. ఆర్తి అందుకు నిరాకరించింది. దీంతో.. ఆమెపై కోపం పెంచుకున్నాడు. అంతేకాదు.. మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందన్న అనుమానమూ పెంచుకున్నాడు. ఆ అనుమానం పెనుభూతమై.. రోహిత్‌ని రాక్షసుడ్ని చేసింది. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదని.. ఆమెని చంపాలని ప్లాన్ చేశాడు.
Read Also: టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్.. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ
మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఆర్తి పనికి వెళ్తుండగా.. రోహిత్ ఆమె వెనకాలే పరిగెత్తుకుని వచ్చి తనతో పాటు తెచ్చుకున్న స్పానర్‌తో తలపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె కుప్పకూలింది. తాను మెల్లగా లేచేందుకు ప్రయత్నిస్తుండగా.. రోహిత్ 15 సార్లు స్పానర్‌తో ఆమె తలపై కనికరం లేకుండా బాదాడు. ఆ దెబ్బలకు ఆమె చనిపోయింది. రోహిత్‌ని అడ్డుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు కానీ, స్పానర్‌తో బెదిరించడంతో అతను వెనక్కు తగ్గాడు. మిగిలిన వారు మాత్రం చూస్తూ ఉండిపోయారు. స్పానర్‌తో ఆర్తి తలపై బాదుతున్నప్పుడు ‘నాకు ఎందుకిలా చేశావ్?’ అంటూ రోహిత్ రెండు, మూడుసార్లు బిగ్గరగా అరిచాడు.
Read Also: టీ20 వరల్డ్‌కప్‌లో ఫిక్సింగ్.. ఓ ఆటగాడిని సంప్రదించి..
ఆర్తి చనిపోయిందన్న విషయం నిర్ధారించుకొని.. జనం మధ్యలో నుంచి రోహిత్ వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడ్ని కనుగొని, గంటల వ్యవధిలోనే అతడ్ని అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉందన్న అనుమానంతోనే తాను ఆర్తిని చంపేసినట్లు రోహిత్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Latest Crime News and Telugu News