New Year: గోవా, చెన్నై నుంచి అక్రమంగా మద్యం దిగుమతి..
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:45 PM
న్యూ ఇయర్ వేడుకలు(New Year celebrations) సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీల నిర్వాహకులు, మద్యం ప్రియులను మచ్చిక చేసుకొని ఇతర ప్రాంతాలకు చెందిన ఖరీదైన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.
- పట్టుకున్న ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ టీమ్స్
- రూ.3 లక్షల విలువైన 113 బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ సిటీ: న్యూ ఇయర్ వేడుకలు(New Year celebrations) సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీల నిర్వాహకులు, మద్యం ప్రియులను మచ్చిక చేసుకొని ఇతర ప్రాంతాలకు చెందిన ఖరీదైన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈక్రమంలో గోవా, చెన్నై(Goa, Chennai) నుంచి ఖరీదైన మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న రెండు ముఠాలను ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌టీఎఫ్ టీమ్‌లు పట్టుకున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నా పేరు డాక్టర్ గోపాల్.. న్యూరో సర్జన్...
గోవా, చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేసుకొని షేక్‌పేటలో ఉన్న ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ టీమ్ సీఐ భిక్షరెడ్డి, ఎస్సై బాలరాజు తన సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నారు. అక్కడ వారి వద్ద 18 నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(Non-duty paid liquor) బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఫైజల్, ఆదిల్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి
ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!
ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగను తాకి..
ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్
Read Latest Telangana News and National News