Hyderabad: వ్యభిచారం కేసులో కొత్త కోణాలు.. పోలీసుల అదుపులో నిందితులు..
ABN , Publish Date - Jan 20 , 2024 | 04:58 PM
రాంనగర్ అఖిల్ వ్యభిచార అరెస్టు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలేష్ ట్రాక్ రికార్డ్ బయటికి తీసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
రాంనగర్ అఖిల్ వ్యభిచార అరెస్టు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలేష్ ట్రాక్ రికార్డ్ బయటికి తీసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఫోన్ లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లను గుర్తించారు. రోజుకు 20 నుంచి 30 కాల్స్ ఇలా వచ్చినట్లు తెలుసుకున్నారు. పశ్చిమ బంగకు చెందిన 16 మంది అమ్మాయిలతో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అఖిలేశ్, రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ లను అరెస్ట్ చేశారు.