Share News

Police: ఎమ్మెల్యే కుమారుడి కోసం పోలీసుల గాలింపు

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:39 PM

చిన్నారిని చిత్రహింసలు చేసి పరారైన వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి(DMK MLA Karunanidhi) కుమారుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Police: ఎమ్మెల్యే కుమారుడి కోసం పోలీసుల గాలింపు

ప్యారీస్‌(చెన్నై): చిన్నారిని చిత్రహింసలు చేసి పరారైన వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి(DMK MLA Karunanidhi) కుమారుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పల్లావరం డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివానన్‌ తిరువాన్మియూర్‌లో నివసిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఇంట్లో కళ్లకుర్చి జిల్లా ఉళుందూర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ దళిత చిన్నారి పనుల్లో చేరింది. ప్లస్‌టూ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన ఆ చిన్నారి ఉన్నత చదువులు చదివేందుకు సహకరిస్తామని ఆమె తల్లిదండ్రులకు ఆండ్రో మదివానన్‌ సతీమణి మెర్లిన్‌ ఇంటి పనులకు చేర్చుకుంది. అయితే ఆ చిన్నారిని హింసించి ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేయించుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై చిన్నారి తల్లిదండ్రులు అందజేసిన ఫిర్యాదును నీలాంగరై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే కుమారుడు, కోడలు వారం క్రితం అదృశ్యమయ్యారు. కేసు విచారణ తీవ్రతరం చేసిన పోలీసులు, వారిద్దరి కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:39 PM