Share News

Punjab: కూతురిని తీసుకెళ్లిన వ్యక్తిపై ఇలా పగ తీర్చుకుంటారా? అల్లుడి సోదరిపై సామూహిక అత్యాచారం..!

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:03 PM

పంజాబ్‌లో దారుణం జరిగింది. తన కూతురిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురుని తీసుకెళ్లిపోయిన యువకుడి సోదరిని మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో రికార్డు చేశాడు.

Punjab: కూతురిని తీసుకెళ్లిన వ్యక్తిపై ఇలా పగ తీర్చుకుంటారా? అల్లుడి సోదరిపై సామూహిక అత్యాచారం..!
Victim (File Photo)

పంజాబ్‌ (Punjab)లో దారుణం జరిగింది. తన కూతురిని తీసుకెళ్లి ప్రేమ వివాహం (Love Marriage) చేసుకున్న యువకుడిపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురుని తీసుకెళ్లిపోయిన యువకుడి సోదరిని మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు (Crime News).


ఈ ఘటన ఈ ఏడాది మే 1వ తేదీన జరిగింది. తనపై సామూహిక అత్యాచారం జరిగిన దగ్గర్నుంచి డిప్రెషన్‌కు గురైన మహిళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన రవీందర్ సింగ్ అనే వ్యక్తి కూతురు, బాధితురాలి సోదరడితో ప్రేమలో పడి అతడితో వెళ్లిపోయింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఆ వివాహం కులాంతరం కావడంతో యువతి తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన కూతురిని తీసుకెళ్లిపోయిన యువకుడిపై పగ పెంచుకున్నాడు.


మే 1వ తేదీన ముగ్గురు వ్యక్తులతో కలిసి బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై నలుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అత్యాచార ఘటనను నిందితులు మొబైల్‌లో రికార్డు చేశారు. ఆ ఘటనతో బాధితురాలు ట్రామా స్థితిలోకి వెళ్లిపోయింది. మానసికంగా కోలుకోలేకపోయింది. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు రవీందర్ సింగ్, వీరేందర్, అమన్ సింగ్, సంతోష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య..


Rachakonda Police: 10 రోజులు.. వందల ఫుటేజీలు.. 900 కి.మీ


మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 12 , 2024 | 12:03 PM