Share News

Secunderabad: ఒడిశా టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా..

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:10 PM

ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్‌ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్‌ రైల్వే డీస్పీ జావీద్‌, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

Secunderabad: ఒడిశా టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా..

- సికింద్రాబాద్‌లో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తనిఖీలు

- 10 కిలోల గంజాయి పొడి స్వాధీనం

- ఇద్దరి అరెస్ట్‌.. పరారీలో ఒకరు

సికింద్రాబాద్‌: ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్‌ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్‌ రైల్వే డీస్పీ జావీద్‌, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్టేషన్‌(Secunderabad Railway Police Station)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీస్పీ జావీద్‌, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: New Year: గోవా, చెన్నై నుంచి అక్రమంగా మద్యం దిగుమతి..


ఉత్తర్‌ప్రదేశ్‌ బండ జిల్లా పైలానీ బారగాన్‌ గ్రామానికి చెందిన మోహిత్‌ (29), అరుణ్‌ కుమార్‌(28), దిపక్‌కుమార్‌(22) ముగ్గురు కలిసి ఒడిశా నుంచి 10.143 కిలోల పొడి గంజాయి సరుకును కోనుగోలు చేశారు. విశాఖపట్నం నుంచి ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) మీదుగా మహారాష్ట్రకు సరుకుతో బయలుదేరారు. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో ప్లాట్‌ ఫాం నంబరు 2లో ఆగింది.


city4.jpg

శనివారం రాత్రి ఎల్‌టీటీ రైలులో జనరల్‌ కోచ్‌లో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా మోహిత్‌ అక్కడి నుంచి పారిపోగా పోలీసులకు అరుణ్‌కుమార్‌, దీపక్‌కుమార్‌(Arun Kumar, Deepak Kumar) పట్టుబడ్డారు. వీరి నుంచి 10.143 కిలోల పొడి గంజాయి ఉన్న బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ. 2.52 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మోహిత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన ఇద్దరిని పోలీసులు రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి

ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!

ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ తీగను తాకి..

ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 29 , 2024 | 01:10 PM