Share News

Tirupati: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో.. వేగం తెచ్చిన అనర్థం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:01 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకుని చెన్నై కీలంబాకంకు బయలుదేరిన నెం.టీఎన్‌ 66 క్యూ 9263 కారు ప్రమాదానికి గురైంది. పుత్తూరు(Puttur) సమీపంలోని పరమేశ్వర మంగళం వద్ద ఉదయం 11.15 గంటలకు ప్రమాదం జరిగింది.

Tirupati: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో.. వేగం తెచ్చిన అనర్థం

- వృద్ధురాలి మృతి

- నలుగురికి తీవ్ర గాయాలు

- పరమేశ్వర మంగళం వద్ద ఘటన

- సురక్షితంగా బయట పడ్డ చిన్నారి

పుత్తూరు(తిరుపతి): తిరుమల శ్రీవారిని దర్శించుకుని చెన్నై కీలంబాకంకు బయలుదేరిన నెం.టీఎన్‌ 66 క్యూ 9263 కారు ప్రమాదానికి గురైంది. పుత్తూరు(Puttur) సమీపంలోని పరమేశ్వర మంగళం వద్ద ఉదయం 11.15 గంటలకు ప్రమాదం జరిగింది. ఇదే గ్రామం హరిజనవాడకు చెందిన ఐలయ్య భార్య శాంతకుమారి(60) రోడ్డు దాటుతుండగా కారు ఆమెను వేగంగా ఢీ కొంది. ఈ క్రమంలో ఆమె ఆక్కడికక్కడే మృతి చెందగా, అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న బండరాయిని ఢీకొట్టింది.

ఈ వార్తను కూడా చదవండి: Music director: నేను విజయకాంత్‌కు రుణపడివున్నా..


కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు తల్లి సీతాలక్ష్మీ, తండ్రి పళినిస్వామి, కుమారుడు నవనీత కృష్ణ, కోడలు వైష్ట్రినేతిలికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి సురక్షితంగా బయటపడింది. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.


nani6.2.jpg

సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును నవనీత కృష్ణ నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శాంతకుమారి మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 12:01 PM