Hathras: హత్రాస్‌లో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
ABN , Publish Date - Jul 11 , 2024 | 12:24 PM
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras district)లో ఇటివల జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో ప్రమాదం(accident) చోటుచేసుకుంది. గురువారం (జులై 11న) ఉదయం వేగంగా వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు బలంగా ఢీకొన్నాయి.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హత్రాస్(Hathras district)లో ఇటివల జరిగిన తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో ప్రమాదం(accident) చోటుచేసుకుంది. గురువారం (జులై 11న) ఉదయం వేగంగా వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు, ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. హత్రాస్‌లోని సికంద్రరావు పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సికంద్రరావులోని ఎటా-అలీఘర్ రహదారిపై టోలి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా వెళ్తున్న ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ బస్సు చండీగఢ్ నుంచి ఉన్నావ్ వెళ్తోంది.
అయితే ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారు, యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందా అనే విషయాలు తేలాల్సి ఉంది. మరోవైపు ఇదే ప్రాంతంలో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయంపై కూడా ఆరా తీయాల్సి ఉంది. ఎందుకంటే నిన్న కూడా ఇదే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుని 18 మందికిపైగా మృత్యువాత పడ్డారు.
నిన్న కూడా ఇలాంటిదే ఒక ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుంచి వస్తున్న స్లీపర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మరణించారు. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. ఈ ఘటన కూడా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీకి వెళ్లే డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడిన ఒక రోజు తర్వాత ఇది చోటుచేసుకోవడం విశేషం. బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోజికోట్ గ్రామ సమీపంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి:
Accident: మినీ బస్సు, ట్రక్కు ఢీ.. 12 మంది స్కూల్ విద్యార్థులు మృతి
Maharashtra: బయటకు తీసుకెళ్లని భర్త.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
Read Latest Crime News and Telugu News