Share News

Ghazipur Case: ప్రియురాలి చిచ్చు.. కుటుంబంలో ముగ్గురు హతం.. తీరా చూస్తే..

ABN , Publish Date - Jul 10 , 2024 | 06:10 PM

కొన్ని ప్రేమకథలు సుఖాంతంగా ముగిస్తే.. మరికొన్ని మాత్రం తీవ్ర విషాదంతో ముగుస్తుంటాయి. హత్యలు చేసేదాకా వ్యవహారాలు వెళ్తుంటాయి. చివరికి.. అడ్డుగా ఉన్నారని సొంత మనుషుల్ని సైతం...

Ghazipur Case: ప్రియురాలి చిచ్చు.. కుటుంబంలో ముగ్గురు హతం.. తీరా చూస్తే..
Ghazipur Case

కొన్ని ప్రేమకథలు సుఖాంతంగా ముగిస్తే.. మరికొన్ని మాత్రం తీవ్ర విషాదంతో ముగుస్తుంటాయి. హత్యలు చేసేదాకా వ్యవహారాలు వెళ్తుంటాయి. చివరికి.. అడ్డుగా ఉన్నారని సొంత మనుషుల్ని సైతం చంపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా అలాంటి దారుణమే ఒకటి వెలుగు చూసింది. ప్రేమ పెట్టిన చిచ్చు ఓ కుటుంబాన్నే బలి తీసుకుంది. అయితే.. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులతో పాటు యావత్ గ్రామమే నిర్ఘాంతపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్ జిల్లా, నంద్‌గంజ్‌లోని ఖిల్వాలో ఆదివారం అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మున్షీ బింద్ (45), ఆయన భార్య దేవంతి దేవి (40), వారి పెద్ద కుమారుడు రామ్ ఆశిష్ బింద్ (20) తమ గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో.. పదునైన ఆయుధంతో వారి గొంతు కోసం చంపేశారు. మరో కుమారుడైన కిషోర్ (15) ఆరోజు ఇంట్లో లేడు. అతడు ఓ ఆర్కెస్ట్రా షో చూసేందుకు వెళ్లాడు. అర్థరాత్రి దాటాక 1:45 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. రక్తపుమడుగులో విగతజీవులుగా పడివున్న తండ్రి, తల్లి, సోదరుడ్ని చూసి అతడు హతాశయుడయ్యాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపేశారని స్థానికులు చెప్పి కన్నీరుమున్నీరు అయ్యాడు.


ఈ సమాచారం అందడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకొని, ఆధారాలను సేకరించారు. మరోవైపు.. మున్షీ బింద్ సోదరుడు రాం ప్రకాశ్ బింగ్ గ్రామానికి చెందిన రాధే బింద్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు పెట్టాడు. వాళ్లే ఆ ముగ్గురిని చంపి ఉంటారని ఫిర్యాదు చేశాడు. అయితే.. విచారణ సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఈ క్రమంలోనే వారికి అసలు నేరస్థుడు ఎవరో తెలిసింది. ఆ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ.. ఆ నేరస్థుడు ఎవరో తెలుసా? మరెవ్వరో కాదు.. మున్షీ బింద్ చిన్న కుమారుడు కిషోర్.


పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని ఎందుకు చంపావని విచారించగా.. తన ప్రియురాలి కోసమేనని పేర్కొన్నాడు. తాను స్థానికంగా ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అయితే.. తన పెళ్లిని కుటుంబ సభ్యులు నిరాకరించారని, ఆ కోపంలోనే వారిని చంపేశానని వివరించాడు. తాను గతంలోనే కొన్నిసార్లు వారిని చంపేందుకు ప్రయత్నించానని, కానీ వీలు పడలేదని తెలిపాడు. చివరికి.. వాళ్లు గాఢ నిద్రలోకి పోయాక, మద్యం సేవించి తాను ఈ దారుణానికి పాల్పడ్డానని నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతడ్ని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 06:10 PM