Share News

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

ABN , Publish Date - Mar 09 , 2024 | 07:22 AM

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు. మబ్బుల కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

శ్రీకాకుళం: అరసవెల్లి (Arasavelli) సూర్యనారాయణ స్వామి (Suryanarayana Swamy) భక్తులకు ( devotees) తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు. మబ్బుల కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు. మరి రేపైనా భక్తులకు ఆ అదృష్టం దక్కుతుందో లేదో చూడాలి. ఏటా ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో, దక్షిణాయణం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 07:22 AM