Share News

Video: హోలీ సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 'భస్మ హారతి'

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:30 AM

ఈరోజు హోలీ(Holi) సందర్భంగా ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర్ ఆలయం(Shree Mahakaleshwar Temple)లో భక్తులు(devotees) కలర్లతో మహాకాళుని సమక్షంలో ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: హోలీ సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 'భస్మ హారతి'

ఈరోజు హోలీ(Holi) సందర్భంగా ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర్ ఆలయం(Shree Mahakaleshwar Temple)లో భక్తులు(devotees) కలర్లతో మహాకాళుని సమక్షంలో ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. పాండే-అర్చకులు, భక్తులు కూడా స్వామిపై పూలు, రంగులు జల్లి భస్మ హారతి(Bhasma Aarti) నిర్వహించి హోలీ ఆడారు. ఆదివారం సాయంత్రం నుంచే హారతి సందర్భంగా భక్తులు తమ భక్తిని చాటుకుని ఆలయ ప్రాంగణంలో హోలికా దహనం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దేవుడి నామస్మరణతో నృత్యాలు చేస్తున్నారు. పూజారులు 51 క్వింటాళ్ల పూలతో మహాకాళ స్వామికి హోలీ నిర్వహించారు.


భస్మ హారతి(Bhasma Aarti)లో పాల్గొనేందుకు భారతదేశం సహా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) రాత్రి నుంచి మహాకాల్ ఆలయానికి చేరుకున్నారు. దీంతో హోలీ సందర్భంగా జ్యోతిర్లింగ మహాకాల్ ఆలయంలో ఉత్సవాలు సందడిగా మారాయి. ఈ పండుగను ఆస్వాదించడానికి ఉత్సాహభరితమైన భక్తులు ఆలయం వద్ద భారీగా గుమిగూడారు. దీంతో ఆలయ పరిసరాలు కీర్తనలు, నృత్యాలతో కోలాహలంగా మారాయి. ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు గులాల్‌తో రంగులు(colours) చల్లుకుంటున్నారు. దేశంలోనే మొదటగా ఈ ఆలయ ప్రాంగణంలో హోలీ పండుగను జరుపుకోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: TS News: ఖమ్మంలో ఘనంగా కామ దహన వేడుకలు

Updated Date - Mar 25 , 2024 | 08:38 AM