Share News

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:37 AM

కార్తీక పౌర్ణిమి సందర్భంగా లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాదు ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
KartikPurnima2024

హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి (Kartik Purnima 2024) చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం నవంబర్ 15, 2024న ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు ఈరోజు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆలయాలకు వెళ్లి వత్తులు వెలిగించి భక్తిని చాటుకుంటారు. ఈరోజు దేవిని పూజించడంతోపాటు పలు రకాల వస్తువులను దానం చేయడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఏలాంటివి దానం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


తెల్లని వస్తువుల దానం

కార్తీక పౌర్ణిమ రోజు పాలు, పెరుగు, నెయ్యి, బియ్యం, పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మీదేవి సంతోషిస్తుందని భక్తుల నమ్మకం. శుక్రగ్రహం బలంగా ఉన్న కారణంగా సంపద వృద్ధి పెరుగుతుంది.

వస్త్రదానం

ఈ రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంత ఎక్కువ బట్టలు దానం చేస్తే ఆర్థిక పరిస్థితి అంత బలంగా ఉంటుంది. అదే సమయంలో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది, దానం సమాజంలో ప్రతిష్టను ఇవ్వడమే కాకుండా సంపద, శ్రేయస్సుకు దారి తీస్తుంది.


ధాన్యాల దానం

పవిత్ర గ్రంధాల ప్రకారం కార్తిక పౌర్ణిమ నాడు ఆహార ధాన్యాలు దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహార కొరత ఉండదు. కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. సమాజంలో ప్రతిష్టకు, ఆత్మ సంతృప్తికి ప్రతీకగా దానం నిలుస్తుంది

బెల్లం దానం

కార్తీక పౌర్ణిమ రోజు బెల్లం దానం చేయడం ద్వారా విష్ణువు సంతోషిస్తారు. ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. బెల్లం దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.


పండ్ల దానం

ఈ పౌర్ణిమ రోజున పండ్లను కూడా దానం చేయవచ్చు. దీని వల్ల అనేక మందికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దేవతల నుంచి కూడా మంచి ఆశీర్వాదం పొందుతారు.

అలంకరణ ఉపకరణాలు

ఈ రోజున మహిళలు మేకప్ వస్తువులను దానం చేయాలి. దీని ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. భర్త, పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారు.


కార్తీక పౌర్ణిమ రోజు చేసే దానం ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణిమ రోజున ఈ వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. దీంతోపాటు దానం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని, వారి జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో కార్తీక పౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన వారికి శ్రేయస్సు లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


ఇవి కూడా చదవండి:

Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..


Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం..

Updated Date - Nov 15 , 2024 | 10:43 AM