Share News

Durga Navaratri 2024: శరన్నవరాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:07 PM

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్...

Durga Navaratri 2024: శరన్నవరాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం

భద్రపద మాసం రేపటితో ముగిసిపోతుంది. దీంతో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి గురువారం నుంచి అంటే.. అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలవుతుంది. దీంతో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు అక్టోబర్ 12వ తేదీతో ముగియనున్నాయి. పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే ఆయా రోజుల్లో పలు రకాల నైవేధ్యాలను అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు. ఈ దసరా వేడుకలకు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కొలువు దీరిన దుర్గమ్మను...

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... అంటూ భక్తులు పూజించనున్నారు.


తొలి రోజు: శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమ:

నైవేద్యం: తీపి బుందీ, శనగలు

చీర: ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

శ్రీబాలా త్రిపుర సుందరీదేవిని పూజిస్తే.. పూర్ణఫలం అందిస్తుందని భక్తుల విశ్వాసం


రెండోవ రోజు: శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ గాయత్రి దేవియే నమ:

నైవేద్యం: రవ్వ కేసరి, పులిహోర

చీర: బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

గాయత్రి అలంకారంలో అమ్మవారిని కొలిస్తే.. సకల మంత్ర సిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం


మూడో రోజు: శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమ:

నైవేద్యం: పోంగలి

చీర: పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అన్నపూర్ణ దేవిని ఆరాదిస్తే.. మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.


నాలుగో రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమ:

నైవేద్యం: పులిహోర, పెసర బూరెలు

చీర: గ్రీన్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను.. అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తులతో పూజలందుకుంటారు.


ఐదో రోజు: శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ మహా చండీ దేవియే నమ:

నైవేద్యం: లడ్డూ ప్రసాదం

చీర: రెడ్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి. చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు.


ఆరో రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమ:

నైవేద్యం: క్షీరాన్నం, చక్కెర ప్రసాదం

చీర: పింక్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు.


ఏడో రోజు: శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:

నైవేద్యం: అటుకులు, బెల్లం, శనగపప్పు, కోబ్బరి ప్రసాదం

చీర: వైట్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి దేవి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.


ఎనిమిదో రోజు: శ్రీదుర్గా దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ దుర్గాదేవియే నమ:

నైవేద్యం: అల్లం గారెలు, నిమ్మకాయ ప్రసాదం

చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. కుంకుమార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.


తొమ్మిదో రోజు: శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవియే నమ:

నైవేద్యం: చింతపండు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదం

చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు.


పదో రోజు: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.

మంత్రం: ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమ:

నైవేద్యం: పులిహోర, గారెలు ప్రసాదం

చీర: పచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.

దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ అనందింప చేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తుల భావిస్తారు.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 01 , 2024 | 04:27 PM