Share News

Amarnath Yatra: ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 100 రెట్ల పుణ్య ఫలం.. ఆగస్టు వరకు ఛాన్స్

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:50 PM

అమర్‌నాథ్ తీర్థయాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. పవిత్ర అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీ దర్శనం కోసం శివ భక్తులు అమర్‌నాథ్ యాత్రకు బయలు దేరి వెళ్తారు. ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Amarnath Yatra: ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 100 రెట్ల పుణ్య ఫలం.. ఆగస్టు వరకు ఛాన్స్
Amarnath Baba Barfani

అమర్‌నాథ్ తీర్థయాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. పవిత్ర అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీ దర్శనం కోసం శివ భక్తులు అమర్‌నాథ్ యాత్రకు బయలు దేరి వెళ్తారు. అయితే అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) అంత ఈజీ అయితే కాదు. దీని కోసం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వర్షం, మరికొన్ని సార్లు చల్లని వాతావరణం కారణంగా భక్తులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బాబా బర్ఫానీ దర్శనం కోసం భక్తులు ప్రతి ఏటా ఉత్సాహంతో బయలుదేరి వెళ్లి దర్శనం చేసుకుంటారు.


అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిలో శివలింగం(shiva) సహజంగా ఏర్పడగా దానిని బాబా బర్ఫానీగా పిలుస్తారు. పవిత్ర అమర్‌నాథ్ గుహ జమ్మూకశ్మీర్‌లో ఉంది. అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ పూర్ణిమ నుంచి ప్రారంభమవుతుంది. బాబా అమర్‌నాథ్ ప్రయాణం శ్రావణ (సావన్) పూర్ణిమ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది శివభక్తులు బాబా దర్శనం కోసం వస్తుంటారు. అమర్‌నాథ్(Amarnath) గుహలో సహజంగా కనిపించే శివలింగం అరుదైనదిగా పరిగణించబడుతుంది.


హిందూ పురాణ విశ్వాసాల ప్రకారం పరమశివుడు పార్వతికి అమరత్వ రహస్యం గురించి చెప్పిన పవిత్ర గుహ ఇది. ఈ పవిత్ర గుహలో మంచు శివలింగాన్ని దర్శించిన భక్తుల పాపాలన్నీ తొలగిపోయి మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణ గ్రంథాల నమ్మకం. అంతేకాదు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెబుతుంటారు. మరోవైపు అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించుకోవడం వల్ల కాశీలో(kashi vishwanath temple) లింగాన్ని దర్శించడం కంటే 10 రెట్లు, ప్రయాగ కంటే 100 రెట్లు ఎక్కువ, నైమిశారణ్య తీర్థం కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని కూడా మరికొంత మంది చెబుతుండటం విశేషం.


అమర్‌నాథ్ యాత్ర 29 జూన్ 2024 నుంచి మొదలుకాగా, ఇది ఆగస్టు 19న ముగుస్తుంది. ఇందుకోసం జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్ హిమాలయాలలోని అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి 5,700 మందికి పైగా యాత్రికుల బ్యాచ్ బుధవారం బయలుదేరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు 3,880 మీటర్ల ఎత్తైన గుహ మందిరంలో 74,000 మందికి పైగా యాత్రికులు పూజలు చేశారని, మంగళవారం 2,500 మందికి పైగా భక్తులు అక్కడికక్కడే నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరవ బ్యాచులో 5,725 మంది యాత్రికులు 256 వాహనాల్లో తెల్లవారుజామున 3.05 గంటలకు బల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌లకు బయలుదేరారు.


ఇది కూడా చదవండి:

Today Horoscope : ఈ రాశి వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి !


Stock Market: జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా..


For Latest News and Devotional News click here

Updated Date - Jul 03 , 2024 | 02:54 PM