Share News

Karthikamasam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:46 AM

Andhrapradesh: కార్తీకమాసం ప్రారంభమవడంతో నదుల్లో కార్తీక దీపాలు విడిచిపెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇక స్వామివారికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Karthikamasam: తెలుగు రాష్ట్రాల్లో  కార్తీక శోభ
Karthika Masam

అమరావతి/హైదరాబాద్, నవంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కార్తీక శోభ సంతరించుకుంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. నేటి (శనివారం) నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభమవడంతో నదుల్లో కార్తీక దీపాలు విడిచిపెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇక స్వామివారికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నరసాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరిలో కార్తీక దీపాలు విడిచిపెట్టారు. తెల్లవారుజాము నుంచి శివాలయం, అమరేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలువురు స్వామి వారికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Kirana Shops: దేశంలో రెండు లక్షల కిరాణా షాపులు బంద్.. షాకింగ్ ఫాక్ట్..


ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. చీరాలలోని మల్లికార్జునస్వామి ఆలయం, పేరాలలో పునుగు రామలింగమల్లేశ్వర స్వామి ఆలయాల్లో అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని శైవాలయాలకు భక్తులు బారులు తీరారు. శ్రీ ఉమామహేశ్వరస్వామి, మురమ్మళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, అకుండళేశ్వరస్వామి, శ్రీ పార్వతీ కుండళేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

karthika-masam.jpg


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు కార్తీకదీపలు వెలిగిస్తున్నారు. కార్తీకమాసం తొలిరోజు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామిఅమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. వేకువజామున నుంచే భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కార్తీకమాసం మొదటి రోజు కావడంతో భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది.

karthikam.jpg

Hindus Rally: దాడుల నుంచి రక్షణ కల్పించాలని 30 వేల మంది హిందువుల ర్యాలీ


తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేశారు. నదిలో దీపాలు వెలిగించి నది ఒడ్డున దీపారాదన చేశారు. శివాలయాల్లో అభిషేకాలు పూజలు నిర్వహించారు. గోదావరిలో స్నానం చేసి దీపారాదన చేస్తే మంచి జరుగుతుందని భక్తులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 11:54 AM