Share News

Dasara NavaRatri 2024: ఈ సమయంలో ఏమి తినాలి.. ఏం తినకూడదంటే.. ?

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:13 PM

ఆశ్వయుజ మాసం ఈ రోజు నుండి అంటే.. గురువారం నుంచి ప్రారంభమైంది. అంటే.. శరన్నవరాత్రులు మొదలైనాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న యమ్మ ముగ్గరుమ్మల మూలపుటమ్మ... దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ దేవతా రూపాల్లో అలంకరిస్తారు.

Dasara NavaRatri 2024: ఈ సమయంలో ఏమి తినాలి..  ఏం తినకూడదంటే.. ?

ఆశ్వయుజ మాసం ఈ రోజు నుండి అంటే.. గురువారం నుంచి ప్రారంభమైంది. అంటే.. శరన్నవరాత్రులు మొదలైనాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న యమ్మ ముగ్గరుమ్మల మూలపుటమ్మ... దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ దేవతా రూపాల్లో అలంకరిస్తారు. ఆయా రోజుల్లో... ప్రతి రోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఇక ఆయా రోజుల్లో అమ్మ వారిని భక్తులు నియమ నిష్టలతో కొలుస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఉపాసించే భక్తులు.. ఉపవాస దీక్షను సైతం చేపడతారు. అంటే ఈ ఉపవాస సమయంలో భక్తులు ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.

Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..


డ్రైఫ్రూట్స్‌తోపాటు ఫ్రూట్స్ తీసుకోవాలి..

ఈ సమయంలో వెంటనే శక్తిని ఇచ్చే ఆహారం.. పండ్లు, డ్రై ఫ్రూట్స్. యాపిల్, అరటిపండు, బొప్పాయి, బాదం, వాల్‌నట్‌‌లతోపాటు ఎండుద్రాక్ష తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లతోపాటు ఖనిజాలను సైతం అందిస్తుంది.

Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ !


పాలు పదార్థాలు..

ఈ ఉపవాస సమయంలో.. క్యాల్షియం, ప్రోటీన్ల కోసం పెరుగుతోపాటు పాల పదార్థాలు తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి కడుపుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జీర్ణక్రియను సైతం మెరుగు పరుస్తాయి.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


సగ్గు బియ్యంతో...

సగ్గు బియ్యంలో కార్పోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే.. సగ్గు బియ్యం జావగా కానీ.. పాయసంగా కానీ చేసుకుని తాగవచ్చు. లేదా పకోడిలు, వడలుగా చేసుకుని తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే రోజంతా చురుకుగా ఉంటారు.


పూల్ మఖానా..

పూల్ మఖాన్‌ను అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటిన్‌‌తోపాటు ఫైబర్ ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఎక్కవ సేపు ఆకలి వేసే అవకాశం ఉండదు.


ఉపవాస సమయంలో ఇవి మాత్రం తీసుకోకండి.. ?

వేయించిన ఆహారం:

సమోసాలు, చిప్స్, పకోడిలు వంటి వేయించిన ఆహారం మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే.. వీటిని ఆహారంగా తీసుకుంటే.. కడుపునకు భారంగా మారుతుంది. ఇవి అసిడిటీ సమస్యలను కలిగిస్తాయి, దీంతో అనారోగ్యానికి గురి కావడం ఖాయం.


శీతల పానీయాలు:

శీతల పానీయాలు, ప్యాకెట్ జ్యూస్‌‌తోపాటు చక్కెర పానీయాలు శరీరానికి తత్కాలికి శక్తిని అయితే ఇస్తాయి, అలా అని వాటిని తీసుకుంటే మాత్రం అనారోగ్యానికి గురికావడం ఖాయం. వీటికి బదులుగా తాజా పండ్లతోపాటు పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లు తాగడం అత్యుత్తమం.


టీ, కాఫీలు:

ఉపవాసం చేసే వారు.. అధికంగా టీ, కాఫీలు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అంతేకాదు.. ఎసిడిటి సమస్యలు సైతం తలెత్తుతాయి. దీనికి బదులుగా, హెర్బల్ టీ లేదా నిమ్మరసం తీసుకోవడం ఉత్తమం.


మార్కెట్ ఫుడ్:

ఈ సమయంలో బయట ప్యాక్ చేసిన లేదా జంక్ ఫుడ్ తినకూడదు. వీటిలో ప్రిజర్వేటివ్స్‌తోపాటు అదనపు ఉప్పు లేదా చక్కెర ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.


నవరాత్రుల్లో అమ్మ వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అదే సమయంలో తీసుకునే ఆహారంపై కూడా మనం ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తగు జాగ్రత్తలు పాటిస్తే.. ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా దృఢంగా ఉంటామన్నది మాత్రం సుస్పష్టం.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 03:17 PM