Dasara Navaratri 2024: రేపు శుక్రవారం.. విశేషమేమంటే..
ABN , Publish Date - Oct 03 , 2024 | 05:45 PM
పంచముఖ రూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిస్తే.. సకల మంత్ర సిద్ది, తేజస్సుతోపాటు జ్ఞానం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభనమూర్తిగా ఈ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు.
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. తొలి రోజు శ్రీబాలా త్రిపురసుందరీగా అవతారంలో దుర్గమ్మవారు దర్శనమిచ్చారు. ఇక రెండో రోజు.. అంటే ఆశ్వయుజ శుక్ల పక్ష విదియ రోజు అమ్మవారు శ్రీగాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి రవ్వ కేసరితోపాటు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.
Also Read: Dasara NavaRatri 2024: ఈ సమయంలో ఏమి తినాలి.. ఏం తినకూడదంటే.. ?
పంచముఖ రూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిస్తే.. సకల మంత్ర సిద్ది, తేజస్సుతోపాటు జ్ఞానం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభనమూర్తిగా ఈ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. దైవ శక్తులకే గాయత్రి మాత మూలాధారమన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ రోజు గాయత్రి మంత్రం .. ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్ మనస్సులో భక్తితో ఉచ్చరిస్తే మంచిదని శాస్త్ర పండితులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఇక ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తే మాత్రం విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారని వారు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..
పంచముఖాలు కలిగిన ఈ గాయత్రి మాత పంచభూతాలకు ప్రతీక అని శాస్త్ర పండితుల ఉవాచ. ప్రపంచం సుభిక్షంగా ఉండేందుకు అనుసరించే మార్గాల్లో గాయత్రీదేవి అర్చన ఒకటని వారు వివరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ శరన్నవరాత్రుల వేళ.. గాయత్రీదేవిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. ఈ రోజు గాయత్రీదేవి మంత్రాన్ని పఠించి, అమ్మవారికి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో పాటు అల్లం గారెలు నివేదన చేయాలని వారు వివరిస్తున్నారు. దీంతో అమ్మవారు మనల్ని చల్లగా కాపాడతారని వారు పేర్కొంటున్నారు.
Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ !
మాములుగా శుక్రవారం అంటేనే మహాలక్ష్మీ. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి దేవాలయాలకు భక్తులు పొటెత్తుతారు. అయితే ప్రస్తుతం నవరాత్రులు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదుర్గమ్మ శుక్రవారం శ్రీగాయత్రి మాతగా దర్శనమివ్వనున్నారు. ఆమెను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు.
Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..
Read More Devotional News and Latest Telugu News