Sun Transit: రాశి మారుతోన్న సూర్యుడు.. ఈ ఐదు రాశుల వారికి సమస్యలు తప్పవు!
ABN , Publish Date - Dec 06 , 2024 | 08:32 PM
ప్రత్యక్ష నారాయణుడు శ్రీసూర్య భగవానుడు. డిసెంబర్ 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడు రాశి మార్పు వల్ల.. ఏ యే రాశులకు వారికి ప్రయోజనం కలుగుతోంది. ఏ యే రాశుల వారు సమస్యలు ఎదుర్కొవలసి ఉంటుందంటే.. జోతిష్య పండితులు ఈ విధంగా వివరిస్తు్న్నారు.
ధనుస్సు రాశిలో సూర్య సంచారం: సూర్యుడు ప్రతి నెల రాశి మారతాడు. సూర్యుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 15వ తేదీన సూర్యుడు తన రాశి మారతాడు. వృశ్చికరాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆయన.. ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు, కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయి. కొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండ వలసి ఉంటుంది. సూర్యుడి రాశి మార్పు కారణంగా ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతుంది.. ఎవరి సమస్యలు పెరుగుతాయంటే.
వృషభం
సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో.. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ రాశి మార్పు కారణంగా.. వృషభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశి వారు.. కుటుంబ సభ్యులతో విడిపోయే అవకాశం ఉంది. కాస్తా గౌరవం సైతం తగ్గవచ్చు. ఈ సమయంలో.. వృషభ రాశి వ్యక్తులు తమ మాటలను నియంత్రించు కోవలసి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వారు సమస్యలను నివారించకో గలిగిన వారు అవుతారు. ఈ రాశి వారు ఆలోచనాత్మకంగా వ్యాపారం చేస్తే లాభం సైతం కలుగుతుంది.
కర్కాటక రాశి
సూర్యుని మార్పు కారణంగా.. కర్కాటక రాశి వారి జీవితం కాస్త ఇబ్బందికరంగా మారవచ్చు. ఈ వారు కుటుంబంలో అసమ్మతి, తగాదాల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో కర్కాటక రాశి వారు... పెద్దల సలహా తీసుకుని.. తర్వాత పని ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది వారి విజయావకాశాలను పెంచుతోంది. ఈ రాశి వారు మతపరమైన పనులు చేస్తే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నది సుస్పష్టం.
కన్య
సూర్యుడు రాశి మారడంతో.. కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల కాస్తా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారిని ఉదర సంబంధిత వ్యాధులు ఇబ్బంది కలిగించే అవకాశముంది. ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు, దీని కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ కన్యా రాశి వారు శాంతితోపాటు పనిలో విజయం సాధించాలంటే.. దుర్గ దేవిని పూజించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అధిక సమయం గడపండి. డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి.
మకరరాశి
మకర రాశి వారు వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో వాదించకుండా ఉండడం చెప్ప తగ్గిన సూచన. మకర రాశి వారు సీనియర్ల సలహాలు, అనుభవంతో పనిని ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశముంది. మకర రాశి వారు.. తమ ప్రత్యర్థుల చురుకుదనం కారణంగా ఇబ్బందులు పడే అవకాశముంది. ఈ రాశి వారు గృహ సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో కుంభ రాశి వారికి ఏకాగ్రత లోపిస్తుంది. మోసగాళ్ల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుంభ రాశి వారు సైతం రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. ఈ రాశి వారిపై కేసు నమోదయ్యే అవకాశముంది. అలాగే ఉన్నతాధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్నీఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..