Share News

Tirumala: తిరుమలలో దర్శనం రోజే రూ.300 టికెట్లు పొందడం ఎలా..

ABN , Publish Date - Oct 01 , 2024 | 08:50 AM

సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్తే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేకపోతే సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఏ రోజుకు ఆరోజు అందుబాటులో..

Tirumala: తిరుమలలో దర్శనం రోజే రూ.300 టికెట్లు పొందడం ఎలా..
Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను దాదాపు రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి. బ్రేక్ దర్శనం అయితే వీవీఐపీ, వీఐపీల సిఫార్సు లేఖలను ముందురోజు తిరుమలలో సమర్పించాలి. టీటీడీ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి దర్శన సౌకర్యం కల్పిస్తారు. బ్రేక్ దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్తే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేకపోతే సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఏ రోజుకు ఆరోజు అందుబాటులో ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. తిరుమలలో కొన్ని రూ.300 టికెట్లను ఏ రోజుకు ఆరోజు కేటాయిస్తారు. వీటినే సుపథం టికెట్లుగా పిలుస్తారు. ఈ టికెట్లు కలిగిన భక్తులను సుపథం క్యూలైన్‌లో దర్శనానికి అనుమతిస్తారు. గంట నుంచి రెండు గంటలలోపు దర్శనం పూర్తవుతుంది. ఈ టికెట్ల కేటాయింపు విషయంలో టీటీడీ కొన్ని నిబంధనలు, షరతులు విధించింది.

Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


టికెట్లు పొందడం ఎలా..

సుపథం టికెట్లను టీటీడీ ఛైర్మన్ కోటా కింద విడుదల చేస్తారు. అత్యవసరంగా దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఛైర్మన్ సిఫార్సు మేరకు సుపథం రూ.300 టికెట్లను కేటాయిస్తారు. సాధారణ రోజుల్లో మాత్రమే ఈ టికెట్ల కేటాయింపు జరుగుతోంది. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు మేరకు ఈ టికెట్లను ఏ రోజుకు ఆరోజు కేటాయిస్తారు. ముందుగా టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సిఫార్సు చేస్తే సుపథం టికెట్లను కేటాయిస్తారు. చివరిగా టీటీడీ ఉద్యోగుల సిఫార్సుపై సుపథం టికెట్లను కేటాయిస్తారు. ఈ టికెట్ పొందిన తర్వాత సుపథం క్యూలైన్‌లో వెళ్లి.. భక్తుల ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఆర్మీ, నేవీ, రక్షణ సిబ్బంది, శ్రీవారి సేవకులకు సుపథం టికెట్లను కేటాయిస్తారు.

Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చులు అధికం


టికెట్ల కేటాయింపు..

మొదట తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల వివరాలను సిఫార్సు చేసే వ్యక్తులకు పంపించాల్సి ఉంటుంది. ఆ వివరాలను టీటీడీ అధికారులకు పంపించిన తర్వాత ఆధార్ నెంబర్ ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. ఒకసారి సుపథం టికెట్ కేటాయిస్తే భక్తుల మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌లో లింక్‌ను ఉపయోగించి సుపథం దర్శనం టికెట్ కేటాయింపు వివరాలను పొందవచ్చు. దానిని ప్రింట్ తీసుకుని సుపథం క్యూలైన్‌లో వెళ్లినట్లయితే రూ.300 చెల్లించి టికెట్ పొందవచ్చు. దర్శన సమయాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 6.00 మధ్యలో ఎక్కువుగా సుపథం దర్శనానికి అనుమతిస్తారు.


Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Chanakya Niti: మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఈ 3 టిప్స్ పాటించాల్సిందే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 01 , 2024 | 08:55 AM