Andhrajyothy: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్నపత్రాలు
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:40 PM
Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 18వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం.
Andhrajyothy Journalism College: ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 18వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. వీటిని గమనించి, అందుకు అనుగుణంగా సంసిద్ధమవ్వాలని సూచన.
కీలక సూచనలు..
1. జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్ష ఆగష్టు 18వ తేదీన అంటే ఆదివారం జరుగుతుంది.
2. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది.
3. అభ్యర్థులు తాము పరీక్ష రాసే కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి.
4. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.
5. అభ్యర్థులు ఇటీవల దిగిన తమ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావలి.
మోడల్ ప్రశ్నపత్రాలు
1. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రవేశపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
2. వీటిలో వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఒక ప్రధానమైన వ్యాసం, రెండు లఘువ్యాసాలు, ఏకవాక్య సమాధానాలు రాయాల్సిన బిట్లు, అనువాదం, ఆంగ్లపదాలకు అర్థాలు, తెలుగు పదాలలో అక్షర దోషాలు సరిదిద్దడం, తెలుగు వాక్యాలలోని తప్పులను సరిదిద్ది తిరగరాయడం, తెలుగు సాహిత్యానికి సంబంధించిన బిట్లు వంటివి ఉంటాయి.
3. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల గతంలో నిర్వహించిన 3 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను మోడల్ పేపర్లుగా అభ్యర్థుల కోసం కింద పీడీఎఫ్ రూపంలో అందిస్తున్నాం.
4. ఈ మోడల్ పేపర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులతో ప్రశేశపరీక్ష ప్రశ్నపత్రం ఉండవచ్చు.
పరీక్ష వివరాలు, మోడల్ ప్రశ్న పత్రాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం కింద పీడీఎఫ్ చూడొచ్చు..