Share News

Diksuchi: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 01:59 AM

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.

Diksuchi: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.

మొత్తం ఖాళీలు: 44,228(ఆంధ్రప్రదేశ్‌-1,355, తెలంగాణ-981)

పోస్టుల వివరాలు

1. బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం)

2. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం)

3. డాక్‌ సేవక్‌

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380; అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470 చెల్లిస్తారు.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5

వెబ్‌సైట్‌: https:indiapostgdsonline.gov.in/

Updated Date - Jul 19 , 2024 | 01:59 AM