JEE Mains: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ.. ఎన్నో ర్యాంక్ అంటే..?
ABN , Publish Date - Apr 26 , 2024 | 06:49 PM
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతా సంతోషంతో మునిగి తేలారు.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతా సంతోషంతో మునిగి తేలారు.
Lok Sabha Elections: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే
మహారాష్ట్ర వాసీం పరిధిలో గల బెల్ ఖేడ్‌కు చెందిన నిల్ కృష్ణ గజరేకు జేఈఈలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ప్రణాళిక ప్రకారం చదివి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నిల్ కృష్ణ ప్రాథమిక విద్య ఆకోలాలో గల రాజేశ్వర్ కాన్వెంట్ స్కూల్‌లో జరిగింది. వాసీంలో గల కరంజ లాడ్‌లో గల జేసీ స్కూల్‌లో హై స్కూల్ విద్య కొనసాగింది. హైస్కూల్ చదువు కోసం బంధువుల వద్ద ఉండి చదివాడని నిల్ కృష్ణ తండ్రి నిర్మల్ తెలిపారు. షెగన్‌లో గల శ్రీ ధ్యనేశ్వర్ మస్కుజి బురుంగలే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నత విద్య కొనసాగింది.
ప్రతి రోజు తన కుమారుడు రోజు 4 గంటలకు లేచే వాడని వివరించారు. 2 గంటలు చదివి, ప్రాణాయం చేసేవాడని వివరించారు. ఉదయం 8.30 గంటలకు తిరిగి చదివేవాడని పేర్కొన్నారు. ప్రతి రోజు రాత్రి 10 గంటలకు పడుకునేవాడని స్పష్టం చేశారు. చక్కగా చదువుకోవాలని చెప్పేవాడని వివరించారు. తన కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో మాటలు రావడం లేదని అతని తండ్రి నిర్మల్ అంటున్నారు.
ఐఐటీ బాంబేలో చదవాలనేది నిల్ కృష్ణ ఆశ అని, సైంటిస్ట్ అవుతానని చెబుతుంటారని వివరించారు. చదువులోనే కాదు నిల్ కృష్ణ ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచాడని తండ్రి నిర్మల్ అంటున్నారు. వచ్చేనెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష కోసం నిల్ కృష్ణ సిద్దం అవుతున్నాడు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నిల్ కృష్ణ ఆశించినట్టు ఐఐటీ ముంబైలో సీటు సాధించడం తేలిక అవుతుంది. ఆర్చరిలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొన్నారని వివరించారు.
Lok Sabha Elections: రెండో దశ బరిలో హేమాహేమీలు.. రాహుల్, హేమమాలిని భవితవ్యం తేలేది నేడే
Read Latest National News and Telugu News