Share News

GIC Job Notification 2024: కంపిటేషన్ తక్కువ.. రూ. 85,000 జీతం.. ఈ జాబ్‌కు అప్లై చేశారా..

ABN , Publish Date - Dec 06 , 2024 | 08:48 PM

Govt Job Notification 2024: గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.. మీకోసమే ఈ వార్త. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి సంబంధించి..

GIC Job Notification 2024: కంపిటేషన్ తక్కువ.. రూ. 85,000 జీతం.. ఈ జాబ్‌కు అప్లై చేశారా..
GIC Job Notification

GIC Job Notification 2024: గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.. మీకోసమే ఈ వార్త. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్‌కు ఎంపికైతే రూ. 85,000 జీతాన్ని పొందవచ్చు. జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం 110 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అప్లికేషన్ డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవగా.. డిసెంబర్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ www.gicre.inలో చెక్ చేయొచ్చు.


పోస్టుల వివరాలు.. ఖాళీలు..

ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం 110 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో జనరల్ విభాగంలో 18 పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి. ఐటీ విభాగంలో 22 పోస్టులు, యాక్చువరీ విభాగంలో 10, బీమా 20, ఇంజినీరింగ్ 5, లీగల్ 9, హెచ్ఆర్ 6, ఎంబీబీఎస్ డాక్టర్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులే(అసిస్టెంట్ ఆఫీసర్).


అర్హతలు, వయోపరిమితి..

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని పోస్టును బట్టి అర్హతలు నిర్ణయించారు. ఏ పోస్ట్ కోసం అయినా సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ తప్పనిసరి. జనరల్‌ పోస్టుకు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA కూడా వర్తిస్తుంది. లీగల్ విభాగంలో పోస్టుకు దరఖాస్తు కోసం ఎల్ఎల్‌బి, ఎల్‌ఎల్ఎమ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.


ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ..

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వైద్య పరీక్షలు చివరిగా జరుగుతాయి. ఈ విధంగా నాలుగు దశలు పూర్తి చేసిన తరువాత అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలవారీ రూ.85,000 జీతం మాత్రమే కాదు, వారికి అనేక రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.


Also Read:

రాశి మారుతోన్న సూర్యుడు.. ఈ రాశులకు సమస్యలు తప్పవు

ఈ ఫొటోలో మచ్చలు లేని కుక్కను కనిపెట్టండి..

పార్లమెంట్‌లోకి నోట్ల కట్టలు తీసుకు వెళ్లవచ్చా..?

For More Education News and Telugu News..

Updated Date - Dec 06 , 2024 | 08:48 PM