Prerana: విద్యార్థులకు చక్కని అవకాశం.. ప్రేరణ ప్రోగ్రాం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే..
ABN , Publish Date - Jan 05 , 2024 | 04:08 PM
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రేరణ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రేరణ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది. ఇది ప్రయోగాత్మక అభ్యాస కార్యక్రమం. జాతీయ విద్యా విధానం (NEP) - 2020 లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అమలవుతోంది. 9 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఐఐటీ గాంధీనగర్ తయారు చేసిన పాఠ్యాంశాలను గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1888లో స్థాపితమైన స్థానిక పాఠశాల నిర్వహిస్తోంది.
రిజిస్ట్రేషన్ కోసం...
ఆసక్తిగల విద్యార్థులు Prerana.education.gov.in అనే పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో సూచించిన విధంగా ఎంపిక చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 10 మంది బాలికలు, 10 మంది బాలురు ఈ ప్రేరణ కార్యక్రమానికి హాజరవుతారు.
ఎలా దరఖాస్తు చేయాలి?..
అర్హత కలిగిన విద్యార్థులు పాఠశాల, స్థానికత, వ్యక్తిగత వివరాలను ప్రేరణ పోర్టల్ లో నమోదు చేయాలి. స్కూల్ లో ఉన్నప్పుడు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొని విజయాలు సాధించి ఉన్నట్లయితే వాటిని ఎంటర్ చేయాలి. విద్యార్థికి ఏదైనా వైద్యపరమైన సమస్యలు ఉంటే వాటిని వివరించాలి. క్వాలిటీ ఆధారంగా ప్రతి జిల్లాలో 200 మంది విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. మరింత సమాచారం కోసం స్థానిక జవహర్ నవోదయను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే..
రోజు వారీ ప్రోగ్రామ్ లో భాగంగా యోగా, మెడిటేషన్ సెషన్‌లు ఉంటాయి. అనంతరం అభ్యసన కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం కార్యక్రమాల్లో పురాతనవారసత్వ ప్రదేశాల సందర్శనలు, స్ఫూర్తిదాయకమైన చలనచిత్ర ప్రదర్శనలు, మిషన్ లైఫ్ క్రియేటివిటీ ప్రోగ్రామ్స్, టాలెంట్ షోలు ఉంటాయి. ఇవే కాకుండా విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలు, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారు.
"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి"