Share News

Railway: రైల్వేలో 9,144 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. శాలరీ రూ.92 వేల వరకు

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:38 PM

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Railway: రైల్వేలో 9,144 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. శాలరీ రూ.92 వేల వరకు

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో(Railway) మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల(jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే వీటిలో టెక్నీషియన్ Gr I సిగ్నల్ కోసం 1092, టెక్నీషియన్ Gr III కోసం 8052 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హత, వయసు ఏంటి? ఫీజు ఎంత, చివరి తేదీ ఎప్పుడనే వివరాలను ఇప్పుడు చుద్దాం. దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inని సందర్శించవచ్చు.

-దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09/03/2024

-చివరి తేదీ: 08/04/2024

-ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08/04/2024

-అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కూడా ఉంటుంది.


జోన్ల వారీగా పోస్టుల వివరాలు

అహ్మదాబాద్ 761, అజ్మీర్ 522, బెంగళూరు 142, భోపాల్ 452, భువనేశ్వర్ 150, బిలాస్పూర్ 861, చండీగఢ్ 111, చెన్నై 833, గోరఖ్‌పూర్ 205, గౌహతి 624, జమ్మూ, శ్రీనగర్ 291, కోల్‌కతా 506, మాల్డా 275, ముంబై 1284, ముజఫర్‌పూర్ 113, పాట్నా 221, ప్రయాగరాజ్ 338, రాంచీ 350, సికింద్రాబాద్ 744, సిలిగురి 83, తిరువనంతపురం 278 ఉన్నాయి.

విద్యార్హత

గ్రేడ్ 1 కోసం ఎ) గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ OR గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి భౌతిక శాస్త్రం/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఏదైనా సబ్ స్ట్రీమ్‌ కల్గి ఉండాలి OR ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా (OR) ఇంజనీరింగ్‌లో పైన తెలిపిన సబ్జెక్టులు గల డిగ్రీ కల్గి ఉండాలి

గ్రేడ్ 3 కోసం గుర్తింపు పొందిన సంస్థల నుంచి మెట్రిక్యులేషన్/SSLC ప్లస్ ITI (OR) సంబంధిత ట్రేడ్‌లలో మెట్రిక్యులేషన్/SSLC ప్లస్ సంబంధిత ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారు అర్హులు


ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులకు పరీక్ష షెడ్యూల్ తర్వాత మిగతా ప్రక్రియలు ఉంటాయి.

ఫీజు

SC, ST, మహిళలు, లింగమార్పిడి లేదా EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 500. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

జీత భత్యాలు

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కనిష్టంగా రూ.29,900 నుంచి గరిష్టంగా రూ.92,300 వేతనం లభించనుంది.

టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కనిష్టంగా రూ.19,900 నుంచి గరిష్టంగా రూ.63,200 వేతనం పొందనున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Superfood Farro: ఈ జబ్బున్నవాళ్ళు ఫారో ధాన్యాన్ని తీసుకుంటే మాత్రం ప్రమాదమే ... !

Updated Date - Mar 11 , 2024 | 02:38 PM