RRB JE 2024: ఆర్ఆర్‌బీ జేఈ 2024 అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే...
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:51 PM
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ పరీక్ష కోసం తమ అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అలర్ట్. జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT 1 కోసం అడ్మిట్ కార్డ్‌లను అధికారులు విడుదల చేశారు. డిసెంబరు 16న నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డులు జారీ కాగా, తదుపరి తేదీల్లో జరిగే పరీక్షలకు అడ్మిట్ కార్డులను క్రమంగా జారీ చేయనున్నారు. రైల్వే జూనియర్ ఇంజనీర్ పరీక్షలు డిసెంబర్ 16, 17, 18, 2024 తేదీలలో జరుగనున్నాయి. సంబంధిత RRB ప్రాంతాల అధికారిక వెబ్‌సైట్‌లలో వీటిని విడుదల చేశారు.
దరఖాస్తుదారులందరూ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం ఇలా ప్రయత్నించండి
దశ 1: మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతం RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
(RRB rrb.apply లేదా rrb.digialm.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి)
దశ 2: తాజా అప్‌డేట్ లేదా ముఖ్యమైన లింక్‌ల విభాగంలో RRB JE CEN-03/2024 లింక్‌ని గుర్తించండి
దశ 3: ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ పేజీకి మళ్లించబడతారు
దశ 4: అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేయండి
దశ 5: ఆ తర్వాత మీరు సబ్మిట్ బటన్‌ను నొక్కిన వెంటనే, మీ అడ్మిట్ కార్డ్ మీకు కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోండి
పరీక్ష హాలులోకి ప్రవేశించాలంటే
రైల్వే జూనియర్ ఇంజనీర్ పరీక్ష అనేక దశల్లో జరుగుతుంది. ఇందులో CBT 1 దశ కూడా ఒకటి. పరీక్ష హాలులోకి ప్రవేశించాలంటే అడ్మిట్ కార్డు తప్పనిసరి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు వారి సంబంధిత RRB రీజియన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 జూనియర్ ఇంజనీర్ (JE) ఖాళీల కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. అభ్యర్థులు CBT-1, CBT-2 పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన దశల ద్వారా చివరకు ఎంపిక చేయబడతారు. RRB JE CBT-1లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు CBT-2 పరీక్షకు అర్హులుగా ఉంటారు.