Group 1 Prelims Exam: జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్..ఈసారి కఠిన నిబంధనలివే..
ABN , Publish Date - May 30 , 2024 | 08:47 AM
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) జరగనుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) నిర్వహించనున్నారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ క్రమంలో ఈసారి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ ఎగ్జామ్ కోసం వచ్చే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, బూట్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. దీంతోపాటు స్త్రీ, పురుష అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలను ధరించకుడదని వెల్లడించారు.
జూన్ 1, 2024 నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డ్‌లు పరీక్ష(exam) ప్రారంభానికి గరిష్టంగా నాలుగు గంటల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది. మరింత సమాచారం కోసం TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in/ని సందర్శించండి. ప్రశ్నపత్రం బుక్‌లెట్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లతో సహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తీసుకెళ్లడం నిషేధించబడింది.
దీంతోపాటు అభ్యర్థులు ఎగ్జామ్ ప్రారంభానికి గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ధృవీకరణ కోసం వారు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు హాల్ టిక్కెట్‌ను(hall ticket) తీసుకెళ్లాలి. ఏదైనా అభ్యర్థి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించబడితే వారు పరీక్ష నుంచి అనర్హులవుతారు. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ నిర్ణయమే అంతిమం. అభ్యర్థులు తప్పనిసరిగా ఇన్విజిలేటర్ తీసుకున్న అన్ని సూచనలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఈ TSPSC గ్రూప్-I రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 563 పోస్టులకు విడుదలైంది.
ఇవి కూడా చదవండి..
Schools Closed: జూన్ 8 వరకు అన్ని స్కూల్స్ బంద్..కారణమిదే
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.