Share News

TET Notification 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల..

ABN , Publish Date - Nov 04 , 2024 | 02:24 PM

TET Notification 2024: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు.

TET Notification 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల..
Telangana TET Notification 2024

TET Notification 2024: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 2025లో ఈ టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్ష ఉంటుందని అధికారులు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జాబ్ క్యాలెండర్‌ను అనౌన్స్ చేసింది. ఇటీవలే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు.. వచ్చే ఏడాదిలో 6 వేలకు పైగా పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా టెట్ నిర్వహిస్తున్నారు.


రెండో టెట్ నోటిఫికేషన్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది నవంబర్‌లో ఈ ఏడాది మే నెలలో తొలి టెట్ ఎగ్జామ్ నిర్వహించగా.. ఇప్పుడు రెండో టెట్ నిర్వహణకు సిద్ధమైంది. టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. అయితే, స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని నిబంధనలు ఉండటంతో వేలాది మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు ఆరుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. నాలుగు సార్లు బీఆర్ఎస్ సర్కార్ టైమ్‌లో నిర్వహించగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్ నిర్వహిస్తున్నారు.


Also Read:

అత్తాకోడలిపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో విస్తుపోయే నిజాలు

గౌతమ్ గంభీర్ పదవికి బీసీసీఐ ఎసరు

టెట్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఇక్కడ చెక్ చేసుకోండి..

For More Telangana News and Telugu news..

Updated Date - Nov 04 , 2024 | 02:24 PM