Share News

UPSC Recruitment Drive: యూపీఎస్సీ మరో నోటిఫికేషన్.. 2,280 ఉద్యోగ ఖాళీలు..!

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:46 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

UPSC Recruitment Drive: యూపీఎస్సీ మరో నోటిఫికేషన్.. 2,280 ఉద్యోగ ఖాళీలు..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ (UPSC Recruitment Drive) జారీ చేసింది. నర్సింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, ఆంత్రపాలజిస్ట్, సైంటిస్ట్ బీ (కంప్యూటర్ సైన్స్ / ఐటీ) తదితర 2,280 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో చివరి తేదీలోపు సమర్పించాలని వెల్లడించింది.

ఉద్యోగ ఖాళీల వివరాలు

  • ఆంత్రపాలజిస్ట్ (కల్చరల్ ఆంత్రొపాలజీ డివిజన్)- 8 పోస్టులు

  • అసిస్టెంట్ కీపర్ - 1 పోస్టు

  • సైంటిస్ట్ ‘బీ’ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) - 3 పోస్టులు

  • రీసెర్చ్ ఆఫీసర్ / ప్లానింగ్ ఆఫీసర్- 1 పోస్టు

  • అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ - 1 పోస్టు

  • అసిస్టెంట్ మినరల్ ఎకానమిస్ట్ (ఇంటెలిజెన్స్) - 1 పోస్టు

  • ఎకనామిక్ ఆఫీసర్ - 9 పోస్టులు

  • సీనియర్ లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ)- 3 పోస్టులు

  • సీనియర్ లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో-డయాగ్నసిస్)- 1 పోస్టు

  • నర్సింగ్ ఆఫీసర్ - 1930 పోస్టులు

  • పర్సనల్ అసిస్టెంట్ - 323 పోస్టులు


విద్యార్హతలు

  • ఆంత్రపాలజిస్ట్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆంత్రపాలజీలో మాస్టర్స్ డిగ్రీ

  • అసిస్టెంట్ కీపర్: ఆంత్రపాలజీలో మాస్టర్స్ డిగ్రీ, మ్యూసియాలజీలో డిప్లొమా

  • సైంటిస్ట్ ‘బీ’ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ): కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఐటీలో బీటెక్ పట్టా.

  • రీసెర్చ్ ఆఫీసర్ / ప్లానింగ్ ఆఫీసర్: ఎకనామిక్స్ / మేథమెటిక్స్ / సైకాలజీ / కామర్స్ / ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ

  • అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్: జియాలజీ / అప్లైడ్ జియాలజీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ

  • అసిస్టెంట్ మినరల్ ఎకానమిస్ట్: జియాలజీ / అప్లైడ్ జిలయాలజీ / ఎకనామిక్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ

  • ఎకనమిక్ ఆఫీసర్: ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకొనోమెట్రిక్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ

  • సీనియర్ లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ): అనస్థీషియాలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్‌డీ / ఎమ్‌ఎస్ పట్టా. రాష్ట్ర లేదా జాతీయ మెడికల్ రిజిస్టర్‌లో పేరు నమోదై ఉండాలి.

  • సీనియర్ లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో-డయాగ్నసిస్): రేడియో డయాగ్నసిస్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఎమ్‌డీ లేదా ఎమ్‌ఎస్ చేసి ఉండాలి.

  • నర్సింగ్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ ఆనర్స్ పట్టా. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

  • పర్సనల్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ


దరఖాస్తు ఇలా

  • యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.

  • అనంతరం, లాగిన్ ఐడీ ద్వారా తదుపరి ప్రక్రియ పూర్తి చేయాలి

  • అప్లికేషన్ పేజీలో పూర్తి వివరాలను నింపాలి.

  • అప్లికేషన్ ఫీజు చెల్లించాక డాక్యుమెంట్లకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక కర్ఫర్మేషన్ పేజీని ప్రింటౌట్ తీసుకోవాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 03:58 PM